Site icon NTV Telugu

Chittoor: ఎమ్మెల్యే ఎవరు చెప్పడానికి?.. జనసేన నేత కీలక వ్యాఖ్యలు..

Ctr

Ctr

Chittoor: ఎమ్మెల్యే ఎవరు చెప్పడానికి? విత్తూరు ఎమ్మెల్యే ఓ పొరంబోకు.. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరుకు వచ్చినపుడు హైరోడ్డు భవన యజమానులకు పరిహారం ఇవ్వాల్సిందేనంటూ జనసేన కార్యకర్త దయరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా, చిత్తూరులోని ఓ హోటల్లో హైరోడ్డు భవన యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వెంకటేష్ నాయుడు చిత్తూరులోని హైరోడ్డు 100 అడుగుల వరకు విస్తరించాల్సి ఉందని, తాము ఎమ్మెల్యేతో మాట్లాడి 80 అడుగులకు ఒప్పించామన్నారు. పరిహారం, టీడీఆర్ బాండ్లు ఏది కావాలో అభిప్రాయాలు చెప్పాలన్నారు‌‌.

Read Also: K – RAMP : బాలయ్య స్టైల్ లో తన సినిమా సూపర్ హిట్ అని తొడకొట్టిన నిర్మాత

ఇక, దీనిపై జనసేన కార్యకర్త దయారాం అంగీకరించలేదు, పవన్ కళ్యాణ్ నష్టపరిహారం ఇస్తామని గతంలో చెప్పారు.. ఇప్పుడు కూడా ఆయన వద్దకే వెళ్తామన్నారు. నీవా నది నీరంతా ఇళ్లలోకి వచ్చేసింది.. నీవానది ఆక్రమణల్ని తొలగించండి అని డిమాండ్ చేశారు. చంద్రబాబు అమెరికా, యూరప్ పోయి ఫండ్స్ తీసుకొచ్చి, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తామంటున్నారు.. ముందు చిత్తూరు హైరోడ్డును అభివృద్ధి చేయండి అని కోరారు.

Read Also: Anantapur: పిల్లల మధ్య గొడవ.. పోలీస్ స్టేషన్ లో కేసులు.. చివరికి ఏమైందంటే..?

అయితే, చిత్తూరులోని హైరోడ్డు శ్మశానంలాగా తయారయ్యింది అంటూ జనసేన కార్యకర్త దయారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హై రోడ్డు విస్తరణకు పరిహారం ఇస్తేనే అంగీకరిస్తాం, టీడీఆర్ బాండ్లు తమకు వద్దని సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. కాగా, ఈ సమావేశం తర్వాత పొరపాటున ఎమ్మెల్యేను పోరంబోకు అనే మాట వచ్చిందంటూ సదరు జనసేన కార్యకర్త క్షమాపణలు చెప్పారు.

Exit mobile version