Four Sisters Get Government Jobs: కూతురు పుట్టిందంటే చాలు.. కుంపటిగా భావించే రోజులు.. అంతేకాదు.. పదో తరగతికి వచ్చిందంటే.. పెళ్లి చేసి బరువు దించుకోవాలని చూసేవాళ్లు ఉన్నారు.. ఇంకా కొందరైతే.. ఇంటరో.. లేదా డిగ్రీ వరకు చదించి.. ఇక చాలమ్మ.. చదివింది అంటారు.. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఓ తల్లి అందరికీ ఆదర్శంగా నిలిచారు.. తమకు కున్న నలుగురు కూతుళ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దదారు.. చేసేది వ్యవసాయమే.. కష్టపడి నలుగురిని చదివించారు.. ఇక, వారి కష్టాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా.. ఆ నలుగురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి సగర్వంగా నిలిచారు.. దీంతో, ఆ తల్లి ఆనందానికి అవదలు లేకుండా పోయాయి..
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం వేపమాకులపల్లెకు చెందిన సీతప్పగారి మునివెంకటప్ప, గౌరమ్మ దపంతులకు నలుగురు కుమార్తెలు.. వీరిది సాధారణ వ్యవసాయ కుటుంబమే అయినా.. అందరు తల్లిదండ్రుల ఆలోచన కంటే భిన్నంగా.. వారి చదువులకే ప్రాధాన్యత ఇచ్చారు.. పెట్టుబడులైనా దక్కని వ్యవసాయన్నే నమ్ముకున్న ఆ దంపతులు.. రాజీ పడకుండా పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు.. కానీ, విధి విచిత్రమైనది.. 2007లో మునివెంకటప్పను తీసుకొల్లింది.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముని వెంకటప్ప ప్రాణాలు విడిచాడు.. పిల్లలు ఇంకా చిన్నవాళ్లే.. చదువులు కూడా పూర్తి చేయలేదు… దీంతో, దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది ఆ తల్లి.. కానీ, పిల్లల చదువుల కోసం మనోధైర్యాన్ని కూడగట్టుకుంది.. ఇక, ఆ తల్లి కష్టాన్ని దగ్గర నుంచి చూసిన నలుగురు కుమార్తెలు. వీణాకుమారి, వాణి, వనజాక్షి, శిరీష.. వీలైనప్పుడు తల్లికి సాయం అందిస్తూనే.. చదువులపై ఫోకస్ పెట్టారు..
Read Also: CM Chandrababu: చంద్రబాబు సీరియస్ వార్నింగ్..! నిజంగానే వారిపై చర్యలు ఉంటాయా..?
మరోవైపు, చదువులు పూర్తి చేసి.. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అక్కాచెల్లెళ్లు.. తమ కష్టాలను లెక్కచేయకుండా.. ఓవైపు బ్యాంకు ఉద్యోగాలు, పోలీస్, టీచరు, ఇతర పోటీ పరీక్షలు.. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటూ వచ్చారు.. వారి కష్టం ఫలించి.. అక్కాచెల్లెళ్లలో పెద్దదైన వీణాకుమారి 2014లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించగా.. 2016 డీఎస్సీలో రెండో కూతురు వాణి ఎస్‌జీటీగా ఉద్యోగం పొందింది.. రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు కూతుళ్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో ఆ తల్లి మనస్సు కొంత వరకు కుదుటపడింది.. ఏ ఉద్యోగంలో ఉన్న కూతుళ్లకు.. ఆ ఉద్యోగంలోనే ఉన్న అబ్బాయిలతో పెళ్లిళ్లు చేసింది.. మిగతా ఇద్దరు కూతుళ్లు కూడా ఆ తల్లి కలలను నిజం చేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టారు.. గత నెలలో విడుదలైన పోలీస్ ఉద్యోగాల ఫలితాల్లో మూడో కూతురు వనజాక్షి కానిస్టేబుల్‌గా, తాజాగా వెలువడిన ఏపీ మెగా డీఎస్సీ ఫలితాల్లో నాల్గో కూతురు శిరీష సెకండరీ గ్రేడ్ టీచరుగా ఎంపికయ్యారు. దీంతో.. ఆ తల్లి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.. ఓ వైపు కట్టుకున్నవాడు కన్నుమూసినా.. పట్టువదలకుండా.. పిల్లలను చదివించి.. అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చి దిద్ది అందరికీ ఆదర్శంగా నిలిచింది గౌరమ్మ.. అంతేకాదు.. ఆడ బిడ్డలకు కూడా ఆ నలుగురు కూతుళ్లు ఆదర్శంగా నిలిచారని చెప్పాలి…
