Site icon NTV Telugu

RK Roja: యూరప్‌ ట్రిప్‌లో మాజీ మంత్రి రోజా..! వైరల్‌గా మారిన ఫొటోలు..

Roja

Roja

RK Roja: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటమి పాలయ్యింది.. ఇక, నగరి నుంచి ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి రోజా.. ఫలితాల తర్వాత ఎక్కడా కనిపించడంలేదనే చర్చ సాగుతోంది.. అధికారంలో ఉన్న సమయంలో.. ఎవరినీ లెక్క చేయకపోవడం.. క్రమంగా తన వ్యతిరేకులను పెంచుకోవడమే ఆమె ఓటమికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అయితే, అధికారంలో ఉన్న సమయంలో గట్టిగా వాయస్‌ వినిపించే ఆమె.. ఆ తర్వాత సైలెంట్‌ మూడ్‌లోకి వెళ్లిపోయారు.. ఇదే సమయంలో రోజా ఎక్కడ? అనే చర్చ సాగుతుండగా.. వైసీపీ శ్రేణులతో టచ్‌లో కూడా లేరట.. అంతేకాదు.. చెన్నైకి మకాం మార్చిన ఆమె.. తమిళనాడులోని ఓ ఆలయంలో పారిశుద్ధ్య కార్మికులతో వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదంగా మారింది..

Read Also: Kalki 2898 AD: మరో రికార్డు బ్రేక్ చేసిన ప్రభాస్ సినిమా

అయితే, ఇప్పుడు మాజీ మంత్రి రోజా ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. జిల్లాల్లో సీరియస్‌ పాలిటిక్స్‌ నడుస్తోన్న సమయంలో.. కనీసం ఎవరితోనూ టచ్‌లో లేకుండా వెళ్లిపోయిన రోజా.. యూరప్‌ ట్రిప్‌లో ఎంజాయ్ చేశారట.. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌ కావడమే కాదు.. ఆమె డ్రెసింగ్‌ స్టైల్‌పై కూడా ట్రోలింగ్స్‌ నడుస్తున్నాయి.. పారిన్‌ ట్రిప్‌కు వెళ్లడాన్ని తప్పుబట్టడంలేదు..! కానీ, కష్టసమయంలో మాకు అండగా ఉండరా? అని నిలదీస్తున్నారు.. కానీ.. రోజా విదేశీ పర్యటనకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తూ ఆడేసుకుంటున్నారు నెటిజిన్లు.. మరి ఆమె సీరియస్‌ పాలిటిక్స్‌కి దూరం అవుతారా? అనే చర్చ కూడా నడుస్తోంది…

Exit mobile version