Site icon NTV Telugu

Narayanaswamy vs Thomas: మాజీ డిప్యూటీ సీఎం వర్సెస్ ఎమ్మెల్యే.. మాటల యుద్ధం..

Thomas

Thomas

Narayanaswamy vs Thomas: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే థామస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. దళితులపై కూటమీ ప్రభుత్వం దాడులు కొనసాగుతున్నాయని.. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తే దళితుడైన నాపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి… ఎమ్మెల్యే థామస్ అసలు దళితుడే కాదని కోట్లాది రూపాయల ప్రకృతి సంపదను నియోజవర్గంలో దోచుకుంటున్నాడంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు‌.. అయితే నారాయణస్వామి వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే థామస్… నేను నిజమైన మాలోడిని.. నన్ను అల్లాగుంట సింగం అంటారు. నువ్వు ఎవరో కూడా మాకు తెలియదు. ఒక్కోరోజు ఒక్కో ఊరి పేరు చెబుతారని ఫైర్ అయ్యారు.. అసలు, నన్ను ఎదుర్కొనే దమ్ము లేక నేను క్రిస్టియన్ అని, నా నామినేషన్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు కూడా నన్ను ఎదిరించలేక లేక అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం చేశారు అంటూ బూతులతో విచురుకుపడ్డారు ఎమ్మెల్యే థామస్‌. విగ్రహానికి నిప్పు పెట్టి ప్రశాంతమైన జీడి నెల్లూరులో కుల రాజకీయాలను చేయాలని చూసింది నారాయణస్వామి అంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే థామస్‌..

Read Also: Realme 15 Pro 5G ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్’ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా

Exit mobile version