NTV Telugu Site icon

CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. రెండో రోజు షెడ్యూల్‌ ఇదే..

Cbn

Cbn

CM Chandrababu Kuppam Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.. రెండో రోజు బిజీబిజీగా గడపనున్నారు సీఎం చంద్రబాబు.. ఉదయం 10 గంటలకు కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహం నుంచి బయల్దేరి టీడీపీ కార్యాలయానికి చేరుకుని జన నాయకుడు సెంటర్ ప్రారంభించనున్నారు చంద్రబాబు.. అక్కడ ప్రజలనుంచి వినతులు స్వీకరించనున్నారు.. అనంతరం కుప్పం పార్టీ కేడర్‌తో సమావేశం అవుతారు.. మధ్యాహ్నం 12.20 గంటలకు కంగుంది గ్రామం చేరుకుని దివంగత శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు చంద్రబాబు..

Read Also: Train Accident: పల్నాడు జిల్లాలో తృటిలో తప్పిన రైలు ప్రమాదం..

ఇక, మధ్యాహ్నం 1.20 గంటలకు కుప్పంలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేరుకుంటారు సీఎం చంద్రబాబు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు 92 కోట్లతో చేపట్టనున్న కడలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన‌ చేస్తారు సీఎం.. ఆ తర్వాత సాయంత్రం 5.05 గంటలకు శాంతిపురం మండలం కడపల్లె వద్ద సొంతింటి నిర్మాణాన్ని పరిశీలించనున్నారు టీడీపీ అధినేత.. ఇక, సాయంత్రం 6.10 గంటలకు ద్రావిడ యూనివర్సిటీ చేరుకుని అకడమిక్ బిల్డింగ్‌లోని కెరీర్ రెడీనెస్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి.. ఆ తర్వాత సాయంత్రం యూనివర్సిటీలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం..

Read Also: Heart Attack: మూడో తరగతి చిన్నారికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలించే లోపే…

కాగా, కుప్పంలోని సుడిగాలి పర్యటన చేస్తున్నారు సీఎం చంద్రబాబు. తొలి రోజు పర్యటనలో ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ను ఆవిష్కరించిన చంద్రబాబు రాష్ట్రంలోనే తొలిసారిగా సూర్యఘర్ సోలార్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రస్తుతం సీగలపల్లెలో ‘ఆర్గానిక్ కుప్పం’ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు‌‌‌ .రెండు రోజుల పర్యటన సందర్భంగా మొదటి రోజు పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జూన్‌లోగా హంద్రీనీవా జలాలు పాలారు వాగు తెచ్చి దానిపై చెక్‌డ్యామ్‌ నిర్మిస్తామని వెల్లడించారు. 2014-19 మధ్య రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించామని, వైసీపీ హయాంలో 4 శాతం అభివృద్ధి తగ్గిపోయిందన్నాదు. రాష్ట్రం అప్పులకుప్పగా మార్చారని మళ్ళీ అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి కూటమీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Show comments