NTV Telugu Site icon

Chittoor: తీవ్ర విషాదం.. పిల్లలతో సహా తల్లి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం

Suicide

Suicide

చిత్తూరు జిల్లాలో పండగ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిల్లలతో సహా తల్లి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లి కరిష్మా (27) పరిస్థితి విషమంగా ఉంది. ఆత్మహత్యకు పాల్పడిన వీరు.. సదుం మసీదు వీధిలో నివాసముంటున్నారు. అయితే.. ఈ ఘటనకు గల కారణం కుటుంబ కలహాలేనని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show comments