తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్వీ పురం టోల్ ప్లాజా వద్ద నిన్న జరిగిన ఘర్షణపై పోలీసులు విచారణ జరిపారు. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..వడమాల పేట టోల్ గెట్ గొడవలో లా స్టూడెంట్స్ .టోల్ గేట్ సిబ్బంది ఇద్దరు తప్పు ఉంది. చిన్న వివాదం పెద్దగా మారింది..కొందరికి గాయాలు అయ్యాయి…చిన్న విషయాన్ని రెండు రాష్ట్రాల గొడవల్లా చూడవద్దన్నారు. ఈ విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తమిళనాడు, ఏపీ ప్రజలు అన్నదమ్ముళ్ళా కలసి ఉంటారన్నారు.
Read Also: Cyber Fraud: సూర్యాపేట వైద్యాధికారికి సైబర్ కేటుగాళ్ళ బురిడీ
లా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏపీ వాహనాలను సరిహద్దుల్లో అడ్డుకోవడం తప్పు. అక్కడి పోలీసులు మనకు సహకరిస్తున్నారు. ఏపీ వాహనాలు తమిళనాడు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. టోల్ గేట్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతాం అన్నారు. ఇదిలా వుంటే.. తమిళనాడు రానిపేట జిల్లా వాలాజ టోల్ గేట్ వద్ద ఏపీ వాహనాలు నిలుపుతున్నారు తమిళనాడు లాయర్స్ అండ్ స్టూడెంట్స్ అసోసియేషన్ నేతలు. వాహనాలను ఆపి నిరసన తెలియజేస్తున్నారు. వాహనాలు ఆపకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తమిళనాడు పోలీసులు.
నిన్న తమిళనాడుకు చెందిన లా స్టూడెంట్స్ టోల్‌గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. పుత్తూరు ప్రైవేట్ కళాశాలలో లా చదువుతున్న తమిళనాడు విద్యార్థులు తిరుపతిలో గత కొద్దిరోజులుగా పరీక్షలు రాస్తున్నారు. శనివారం పరీక్షలు చివరి రోజు కావడంతో తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో వడమాలపేట ఎస్వీ పురం టోల్‌ప్లాజా వద్ద లా చదువుతున్న విద్యార్థి కారు టోల్ రుసుము చెల్లింపులో వివాదం రేగింది. దీంతో టోల్ సిబ్బందితో లా విద్యార్థులు గొడవకు దిగారు. రుసుము చెల్లించడానికి ఆ వాహనానికి ఉన్న ఫాస్ట్ ట్యాగ్‌లో డబ్బులు లేవు. దీంతో టోల్ సిబ్బంది వాహనాన్ని వెనక్కి తీసి మిగిలిన వారికి దారి వదలమని చెప్పారు. దీంతో మాట మాట పెరిగి తమిళనాడు విద్యార్థులు మొదటగా టోల్ సిబ్బందిపై హెల్మెట్‌తో దాడి చేశారు. ఈ వివాదంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Read Also: Law Students: టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత.. సిబ్బందిపై లా స్టూడెంట్స్ దాడి