ఏపీలో పాలనపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ రాష్ట్రం అధ్వన పరిస్థితుల్లోకి వెళ్ళిందన్నారు. ఆంధ్రకు అబద్ధాల ప్రదేశ్ గా పేరొచ్చింది. అసెంబ్లీలో మొత్తం అబద్ధాలతో గడుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వరం పోలవరం ఆగిపోయింది. ఒకప్పుడు ఏమీ లేని అదాని ప్రపంచ కుబేరుడు అయ్యాడు. దేశంలో 60 కోట్ల మంది, ఏపిలో కోటి మంది ఆకలితో వుంటున్నారు. కోటి మంది ఆకలితో నిద్రపోతే రాజన్న రాజ్యం అంటారా?
ఎమ్మెల్యే లు, మంత్రులు ప్రభుత్వ భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ఎర్ర చొక్కాలు, ఖద్దరు చొక్కాలు లేకపోవటంతో మాట్లాడేవాడు లేడు. ఎనిమిది పులులు తీసుకొచ్చి ప్రధాని ఫోటోలు తీయటం ఏంటి? మా నాయకులు నేతాజీ, సర్దార్ పటేల్, అంబేడ్కర్ ఫోటోలు పెడుతున్నారు. వాజ్ పేయ్, అద్వానీ ఫోటోలు పెట్టుకోవచ్చు కదా…. మా నాయకుల ఫోటోలు పెట్టటం ఏంటి? గ్యాస్ సిలిండర్ల ధర 2024లో యూపీఏ ప్రభుత్వం గెలిపిస్తుంది.
ఈసారి బీజేపీ కి 100 సీట్లు కూడా రావు. గ్యాస్ ధర రూ.500 కు తీసుకొచ్చేది మా మొదటి సంతకం అన్నారు చింతా మోహన్. దేశంలో ప్రజలు రాహుల్ వైపు చూస్తున్నారు. ఏపీని విడగొట్టమని గులాంనబీ ఆజాద్ దొంగ సలహా ఇచ్చాడు. 2019 నుంచి ప్రతివారం రహస్యంగా మాట్లాడుకునేవారు. ఆజాద్ ని భారత రాష్ట్రపతిగా పోటీచేయిందమని మోదీ ఆలోచన వుండేదన్నారు. కానీ దానికి RSS ఒప్పుకోలేదన్నారు చింతా మోహన్.
Read Also: Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. హైదరాబాద్ కేంద్రంగా కదులుతున్న డొంక
