Site icon NTV Telugu

Chinarajappa : అమలాపురం అల్లర్లు పోలీసులు, ఇంటిలిజెన్స్ వైఫల్యం

Chinarajappa

Chinarajappa

కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మాజీ హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. అమలాపురం అల్లర్ల సంఘటనలో పోలీసులు, ఇంటిలిజెన్స్ వైఫల్యం ఉందని ఆయన ఆరోపించారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అల్లర్ల ఘటనలో వైసీపీ వారు చెప్పారని అమాయకులను బలిచేస్తే చూస్తూ ఊరుకోమంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.

కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే టీడీపీ వారు చేస్తున్నారని మంత్రి విశ్వరూప్ వ్యాఖ్యలు చేయడం సరికాదని, రైతులు అమ్ముకున్న ధాన్యం కు డబ్బులు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన మండిపడ్డారు. రైతులు నష్టాలను భరించలేక పంట విరామం చేస్తున్నారని, వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలలోకి వెళ్తుంటే తరిమి తరిమి కొట్టేపరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు.

Exit mobile version