Minister Chelluboina: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌పై ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారని.. రాజకీయాలు ఒక వికృత క్రీడగా మారిపోయాయని.. ఎవరి ఇష్టానుసారం వారు మాట్లాడటం అలవాటు అయిపోయిందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. మాతో పెట్టుకుంటే ఏదైనా చేస్తాం అన్న వ్యాఖ్యలను తక్షణమే గంగుల కమలాకర్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రులకు ఇష్టానుసారం మాట్లాడడం అలవాటైపోయిందనిమంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also:House EMI: సామాన్యులకు మరో షాక్.. గృహరుణాలపై వడ్డీరేట్లు పెంచిన బ్యాంకులు
వైఎస్‌ఆర్ కుటుంబం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై మంత్రి చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వంపై దురహంకార వ్యాఖ్యలు సరికాదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబానికి సజ్జల ఆప్తమిత్రులు అని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి నీతి కలిగిన నాయకుడు అని.. వైఎస్ఆర్ కుటుంబాన్ని ఆదరించే వ్యక్తి అని పేర్కొన్నారు. జగన్ కష్టపడి పనిచేసే ప్రతి పనిదలో సజ్జల ఉంటారన్నారు. ఆంధ్ర ప్రజలపై విష ప్రచారం చేస్తున్నారని.. తక్షణమే ఈ పనిని విరమించుకోవాలన్నారు. ఆంధ్ర ప్రజలపై తెలంగాణ నాయకులు అక్కసు కక్కుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఏదైనా అవసరం వస్తే తెలంగాణ నేతలకు తామే తీర్చాలన్నారు. మున్నూరు కాపులను ఆదుకున్న విశాల హృదయం జగన్‌ది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పాలనపై దుహంకార వ్యాఖ్యలు సరికావన్నారు. తెలుగువారిగా విడిపోయినా మనసులు విరిగిపోయినట్టు వ్యాఖ్యలు ఉండకూడదన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వలసలు వస్తున్నాయని.. కాంగ్రెస్ పార్టీ కష్టపూరితంగా రాష్ట్రాన్ని విడదీయడం ద్వారా ప్రజలు ఇబ్బందిపడిన విషయం వాస్తవమన్నారు. ఈ రాష్ట్రం కష్టాల పాలు అవడానికి ప్రతిపక్షనేత చంద్రబాబే కారణమని మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు.