Minister Savitha: సీఎం చంద్రబాబు పాలన చేనేతలకు స్వర్ణయుగం లాంటింది మంత్రి సవిత తెలిపారు. 200ల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్ లు పెడుతున్నాం.. చేనేతలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తున్నాం.. చేనేతలకు లేటెస్ట్ డిజైన్ సెంటర్లను ఏర్పాటు చేసి మొబైల్ షాప్స్ ను పెంచుతాం.. 90 శాతం సబ్సిడీతో ఫ్రెమ్స్, ఇతర పరికరాలను అందిస్తామని చెప్పుకొచ్చింది. ఈ నెలాఖరికి క్రిఫ్ట్ ఫండ్ ను ఏర్పాటు చేస్తాం.. ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్క్ ను అభివృద్ధి చేసి రానున్న రోజుల్లో చంద్రబాబుతోనే ప్రారంభిస్తామని మంత్రి సవిత వెల్లడించింది.
Read Also: Jr NTR : కొత్త లుక్ లో ఎన్టీఆర్.. పిక్స్ చూశారా..
ఇక, రాష్ట్రంలో 1000 ఎకరాల ల్యాండ్ ఉంటే రిలయన్స్ 65 వేల కోట్ల రూపాయలతో సీబీజీ ప్లాంట్ పెట్టేందుకు సిద్ధంగా ఉంది అని మంత్రి సవిత తెలిపారు. ఏపీఐఐసీ ద్వారా 7 కోట్ల రూపాయలతో టెక్స్ టైల్ పార్క్ ను మొదటి దశలో 20 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అని తేల్చి చెప్పారు. ఈ పనులు 3 నెలల్లో పూర్తి చేస్తాం అన్నారు. అలాగే, 20 లక్షల ఉద్యోగలు ఇవ్వాలనే లక్ష్యంతోనే నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను పెడుతున్నామన్నారు.