Site icon NTV Telugu

Chandrababu : ఎన్టీఆర్ ఓ యుగపురుషుడు.. ఆయనకు ఆయనే సాటి..

Chandrababu

Chandrababu

నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు శతిజయంతి వేడుకులను పురస్కరించుకొని టీడీపీ అధినేత ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనం మన వెంట ఉంటే జనం లేని బస్సులు వైసీపీ వైపు ఉన్నాయంటూ ఆయన విమర్శించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు జాతి వెలుగు ఎన్టీఆర్. తెలుగు ప్రజల పౌరుషం ఎన్టీఆర్. ఎంతమంది పుట్టినా ఎన్టీఆర్ ఎన్టీఆరే అంటూ ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ ఓ యుగపురుషుడని, ఎన్టీఆర్‌కు ఎన్టీఆరే సాటి అంటూఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో రూ.2 బియ్యం పథకం దేశ ఆహార భద్రతకే ఆదర్శమని, సామాన్య కుటుంబంలో పుట్టి అద్భుతాలు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు.

డైరెక్టరుగా, ప్రొడ్యూసర్‌గా, యాక్టరుగా రికార్డు సృష్టించిన నటుడు ఎన్టీఆర్ అని, ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అని, ఎన్టీఆర్ సంస్కరణ వాది.. ముందు చూపు ఉన్న వ్యక్తి అని ఆయన అన్నారు. ఆత్మ స్థైర్యంతో ముందుకు వెళితే ఓటమి ఉండదని చెప్పిన నేత ఎన్టీఆర్.. ఒంగులులో అభివృద్ది జరిగింది అంటే దామచర్ల జనార్థన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే… తెలుగు దేశం సమయంలోనే రోడ్లు వేశారు.. పనులు చేశారు. మనకు బస్సులు ఇవ్వకుండా.. వైసీపీ బస్సు యాత్ర పెట్టింది. మనకు జనాలు ఉన్నారు.. వైసీపీకి బస్సులు ఉన్నాయి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Exit mobile version