టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.. జిల్లాల పర్యటనలో భాగంగా.. ఇవాళ తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో పర్యటించనున్నారు.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవులో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు చంద్రబాబు. ఇక, సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగనుంది..
Read Also: Kedarnath: తెరచుకున్న కేదార్‌నాథ్.. భక్తుల పులకింత..
చంద్రబాబు పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి..
* అన్నవరంలో ఉదయం 10 గంటలకు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ముఖ్య నేతలతో సమావేశం.
* ఉదయం 11 గంటలకు తుని, ప్రత్రిపాడు కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న చంద్రబాబు.
* ఉదయం 11.30కి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న బొడ్డు వెంకటరమణ చౌదరి.
* మధ్యాహ్నం 12.30 గంటలకు అన్నవరంలో చంద్రబాబు మీడియా సమావేశం.
* మధ్యాహ్నం కత్తిపూడి, గొల్లప్రోలు, కాకినాడ భానుగుడి సెంటర్ మీటింగ్‌లలో పాల్గొనున్న టీడీపీ అధినేత.
* మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తాళ్లరేవు మండలం మాధవరాయుని పేటలో బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో రచ్చబండలో పాల్గొని సహపంక్తి భోజనం చేయనున్న బాబు.
* రాత్రికి రామవరంలో అనారోగ్యంతో బాధపడుతున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డికి పరామర్శ.
* రాత్రికి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ బయల్దేరనున్న చంద్రబాబు.