Chandrababu Naidu: గిరిజన హక్కుల పరిరక్షణకు చర్యలేవీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గిరిజనుల సాంప్రదాయక భూములు గిరిజన తెగలకే దక్కాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. గిరిజనులకు ఆదివాసీ దివస్ సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల సంక్షేమం దిశగా ప్రభుత్వం కృషి చేయకపోగా, గిరిజన భూముల ఆక్రమణను జోరుగా సాగిస్తోంది. బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను 2016లో మా ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు లేటరైట్ ముసుగులో బాక్సైట్ దోపిడీ జరుగుతోంది. బాక్సైట్ దోపిడీ కోసం అడవులను నరికేసి ఆగమేఘాలమీద రోడ్డు వేసేసారు. అంతవేగంతో రాష్ట్రంలో ఇంకెక్కడైనా కిలోమీటరు రోడ్డు వేసారా? గిరిజన గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే వారిని డోలె కట్టి కిలోమీటర్ల కొద్దీ మోసుకెళ్లాల్సిన దుస్థితి ఉంది.
ఇప్పటికీ తాగేందుకు గిరిజనులు గెడ్డ నీటినే ఉపయోగిస్తున్నారు. గెడ్డలో నీరు కలుషితమై గిరిజనులు జబ్బుల బారిన పడుతున్నా ప్రభుత్వం తాగునీటి సరఫరాకు ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ఇప్పటికైనా గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గిరిజన సోదరులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచీ గిరిజన సంక్షేమం, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసింది. గిరిజన ప్రాంత భూములు, ఉద్యోగాలు, అటవీ హక్కులు వంటి వాటి కోసం ఆనాడు ఎన్టీఆర్ 14 చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని జీవోలు కూడా తెచ్చారు.
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
షెడ్యూల్డ్ ప్రాంతంలో జీవో 3 ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగాలన్నింటినీ స్థానిక గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలి. ఆ జీవోను ప్రస్తుత వైసీపీ హయాంలోనే కోర్టు రద్దు చేస్తే… పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నమూ చేయకపోవడం విచారకరం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బైక్ అంబులెన్సులు ఇప్పుడు లేవు. అలాగే గిరిజన ప్రాంతాల్లో వారాంతపు సంతల్లో రోగులకు మెరుగైన వైద్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ అంబులెన్స్ సేవలు కూడా ఇప్పుడు లేవన్నారు చంద్రబాబునాయుడు.
Telangana Congress: మునుగోడు ఉపఎన్నికలో గెలుపు ఆ పార్టీకి సవాల్ గా మారిందా.?
గిరిజన సోదరులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచీ గిరిజన సంక్షేమం, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం కృషిచేసింది. గిరిజన ప్రాంత భూములు, ఉద్యోగాలు, అటవీహక్కులు వంటి వాటికోసం ఆనాడు ఎన్టీఆర్ 14 చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని జీవోలు కూడా తెచ్చారు.(1/6)
— N Chandrababu Naidu (@ncbn) August 9, 2022
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..