Site icon NTV Telugu

Chandrababu Naidu: కుప్పంలో రౌడియిజం పెరిగిపోయింది.. వైసీపీ చేసిన అవినీతిని కక్కిస్తా..

Chandrababu Naidu

Chandrababu Naidu

కుప్పం నా సొంత ఊరు అని.. కుప్పంలో ఈసారి లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గురువారం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించిన చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి గుడిపల్లి గుండెకాయ లాంటిదని, అలాంటి తనకే ఇక్కడ రక్షణ లేదన్నారు. కుప్పంలో రౌడియిజం పెరిగిపోయిందని, సామాన్యులకు ఇక్కడ రక్షణ కరువైందని వాపోయారు. ఇక రాష్ట్రంలో వైసీపీ సినిమా అయిపోయిందని.. ఇక 100 రోజు సమయమే ఉందన్నారు.

Also Read: Chandrababu: చంద్రబాబు బహిరంగ సభల షెడ్యూల్ ఖరారు..

పోలీసులకు తానే దిక్కు అని చెబుతూ.. వారితో తప్పుడు పనులు చేయించడం తప్పా ఏం చేశాడని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం పని అయిపోయిందని.. ఎన్నికల కమిషన్ కూడా ఆపరేషన్‌కు వచ్చేసిందన్నారు. వైసిపి చేసినా అవినీతిని కక్కిస్తానన్నారు. బాబు వస్తేనే జాబు వస్తుంది.. ఆరు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత నాదీ అని హామీ ఇచ్చారు. కుప్పానికి నీళ్ళు ఇచ్చే భాద్యత తనదన్నారు. బీసీలను అవమానిస్తే అట్రాసిటీ చట్టం తీసుకువస్తా.. బీసీలకు అన్ని రకాలుగా అండదండలు అందజేస్తాం.. త్వరలో జయహో బీసీ కార్యక్రమం చేపడతామన్నారు.

Also Read: UP Shocker: పాటలు వినడానికి మొబైల్‌ అడిగినందుకు.. భర్త కంట్లో కత్తెరతో పొడిచేసిన భార్య

నిరుపేదల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తానని, ఎమ్మెల్యేలకు దోంగల పని నేర్పింది సీఎం జగన్ అని విమర్శించారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు స్పందిస్తూ.. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదని, సీఎం అని పిలుపునిచ్చారు. అమాయకపు ఎమ్మెల్యేలను తీసేసి తానో గోప్పో నాయకుడని సీఎం జగన్ అనుకుంటున్నాడన్నారు. ఐదేళ్లలో ఒక్క స్టేడియాలు కట్టలేదు.. కాని, ఆడుదాం ఆంధ్రా అంటా….? అని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు దోచుకుందాం, దాచుకుందాం అనే ఆడుకుంటే బాగుంటుందని, కుప్పంలో వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎలా భూస్దాపితం అవుతారో చూసుకోండి అని చంద్రబాబు సవాలు విసిరారు.

Exit mobile version