NTV Telugu Site icon

Chandrababu: టీడీపీ నేత రవిపై దాడి గురించి డీజీపీకి చంద్రబాబు లేఖ

Chandrababu

Chandrababu

కుప్పం టీడీపీ నేత, గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్ రవిపై దాడి అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాశారు. లేఖతో పాటు ఫొటోలు, సీసీటీవీ ఫుటేజీని చంద్రబాబు జతచేశారు. వైసీపీ గూండాల వల్ల కుప్పంలో శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయని ఆయన లేఖలో వివరించారు. గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్ రవి నివాసంపై దాడి కుప్పంలో వైసీపీ అరాచకానికి నిదర్శనమని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో ఉన్న రవి ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారన్నారు.

Jp Nadda: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

పార్టీ నేత రవిని ఫోన్ చేసి బెదిరించిందే కాకుండా.. ఇంటిపై అర్థరాత్రి దాడి చేశారని తెలిపారు. దాడికి కారణం అయిన సెంథిల్, శ్రీనివాసులు, కోదండ అనే వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని చంద్రబాబు లేఖలో కోరారు. కుప్పంలో ప్రశాంతత దెబ్బతినకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.