Chandrababu Go Back Flexis: సైకో చంద్రబాబు గో బ్యాక్.. గో బ్యాక్ చంద్రబాబు.. పుంగనూరులో మతకలహాలు సృష్టిస్తూన్న చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగు దేశం పార్టీ గూండాల దాడి.. టీడీపీ గూండాలు గొడవలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నిస్తున్న కొన్ని ఫొటోలను జోడించి పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.. ఈ ఫ్లెక్సీలకు అన్నమయ్య జిల్లా పీలేరు వేదికైంది.. చంద్రబాబు గో బ్యాక్ అంటూ పీలేరు రైల్వే ట్రాక్ వద్ద ఈ ఫ్లెక్సీలను పెట్టారు.. పీలేరు సబ్ జైల్‌కు ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లనున్న నేపథ్యంలో.. గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లు హాట్‌టాపిక్‌గా మారిపోయాయి..
Read Also: Cock fight: కోడి పందాల్లో అపశృతి.. కోడి కత్తి గుచ్చుకుని ఇద్దరు మృతి
కాగా, అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైలుకు వెళ్లనున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. జైలులో ఉన్న పుంగనూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలను పరామర్శించనున్నారు.. ఈ నెల 7వ తేదీన రొంపిచర్లలో చల్లా బాబు ఫ్లెక్సీలను చింపడానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలను.. టీడీపీ శ్రేణులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాయని.. దీంతో.. టీడీపీ – వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుందని చెబుతున్నారు.. కాగా, ఈ ఘటనలో టీడీపీ క్యాడర్ పై హత్యాయత్నం సెక్షన్ సహా పలు సెక్షన్లతో కేసులు నమోదు చేశారని ఫైర్ అవుతున్నారు.. అయితే, ఈ ఘటనలో 8 మంది టీడీపీ కార్యకర్తలను 10వ తేదీన అరెస్టు చేశారు పోలీసులు.. జైల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలను పీలేరు సబ్ జైలుకు వెళ్లి పరామర్శించనున్నరు టీడీపీ అధినేత చంద్రబాబు.
