Site icon NTV Telugu

కొత్త జిల్లాలకు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదు?: చంద్రబాబు

ఏపీలో గురుకుల విద్యాసంస్థలకు దివంగత లోక్‌సభ స్పీకర్ బాలయోగి పేరును తొలగించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాలకు బాలయోగి పేరును తొలగించడం తీవ్ర అభ్యంతరకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దళితుల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన బాలయోగి పేరును వైసీపీ ప్రభుత్వం తొలగించడం దారుణమన్నారు. అంబేద్కర్ పేరునే పెట్టాలని ప్రభుత్వం భావిస్తే.. జగన్, వైఎస్ఆర్ పేరుతో కార్యక్రమాలకు ఆ పేరు తొలగించి అంబేద్కర్ పేరు పెట్టవచ్చని సూచించారు.

Read Also: ఆందోళనలు కొనసాగిస్తాం.. స్పష్టం చేసిన ఏపీ టీచర్స్ ఫెడరేషన్

అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తే.. దానికి దళిత తేజం బాలయోగి పేరు తొలగించాల్సిన అవసరం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్ సర్కారుకు చిత్తశుద్ది ఉంటే కొత్త జిల్లాలకు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగు జాతి గ‌ర్వప‌డే ద‌ళిత బిడ్డ బాల‌యోగి పేరును తొల‌గించ‌డం వైసీపీ సర్కారు కుసంస్కారానికి నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు.

Exit mobile version