Chandrababu : సీఎం జగన్ మౌనం దేనికి సంకేతం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతిలో నేడు టీడీపీ చీఫ్ చంద్రబాబు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు ఉప ఎన్నికపై వైసీపీ కనీస సంస్కారం లేకుండా మాట్లాడిందని ఆయన మండిపడ్డారు. చనిపోయిన కుటుంబ సభ్యులకే ఉప ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదనేది టీడీపీ విధానమని, ఈ విధానంతోనే గౌతమ్ రెడ్డి మృతి కారణంగా వచ్చిన ఉప ఎన్నికలో టీడీపీ పోటీ పెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ నేత చనిపోవడం వల్ల వచ్చిన ఉప ఎన్నికలపై వైసీపీ సవాళ్లు నీచంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. బద్వేలులో ఎందుకు పోటీ పెట్టలేదో.. ఆత్మకూరులో కూడా అందుకే పోటీ పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు.
అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ప్రజలు, ఉద్యోగులపై దాడులు చేయడం పరిపాటిగా మారిందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఏఈ సూర్యకిరణుపై దాడి చేయడం దారుణమని ఆయన అన్నారు. స్వయంగా ప్రజా ప్రతినిధులు, వైసీపీ మూకలు అధికారులపై దాడులు చేస్తుంటే.. సీఎం మౌనం దేనికి సంకేతం..? అని చంద్రబాబు ప్రశ్నించారు. రివర్స్ టెండర్ల విధానంతో సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టును రివర్స్ చేశారన్న చంద్రబాబు.. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి ఈ ప్రభుత్వ మూడేళ్ల నిర్వహణా వైఫల్యమే కారణమన్నారు.
Also Read
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్‌లోకి రావాలి..!
- CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
- Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
తాజావార్తలు
-
MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
-
Calorie Deficit: బరువు తగ్గే డైట్లో ఆకలి ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
-
Karnataka: ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యం.. పోలీసుల గాలింపు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!