YS Jagan: భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో క్రెడిట్ చోరీ చేయటం చంద్రబాబు కోసం పడరాని పాట్లు పడుతున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడికి ప్లాన్ చేసిన చంద్రబాబు.. 15 వేల ఎకరాల భూమి కావాలన్నారు.. దీనికి వ్యతిరేకంగా 130 కేసులు వేశారు.. మేం వచ్చాక 2,700 ఎకరాలకు కుదించి పనులు మొదలు పెట్టాం.. 2,200 ఎయిర్ పోర్టుకు.. ఎయిరో సిటీకి 500 ఎకరాలు కేటాయించామని తెలిపారు. మేం వచ్చాక కోర్టు కేసులు మొత్తం క్లియర్ చేశాం.. మూడు గ్రామాల్లో 400 కుటుంబాలు తరలించి కాలనీ కట్టాం.. ఆ రోజుల్లో విమానయాన మంత్రిగా అశోక్ గజపతి రాజు ఉన్నారు, చంద్రబాబు ఒక్క అనుమతి కూడా తెచ్చుకోలేక పోయారు.. మేం వచ్చాక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వెంట పడ్డాం.. నేను స్వయంగా వెళ్ళి ప్రధానిని అనేక సార్లు కలిసి వినతి పత్రం ఇచ్చానని జగన్ వెల్లడించారు.
Read Also: Kolkata: ఎన్నికల వేళ కోల్‌కతాలో ఈడీ దాడులు.. సీఎం మమత హల్‌చల్
ఇక, కావాల్సిన అనుమతులు మొత్తం మేమే తెచ్చాం అని జగన్ పేర్కొన్నారు. ప్రతీ పని మా హయంలోనే జరిగింది.. రోడ్లు, నీళ్లు, కరెంట్ కు కూడా మేమే నిధులు ఇచ్చాం.. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా మేం ఫోకస్ చేసాం కాబట్టే శంకుస్థాపన చేశాం.. అప్పుడే చెప్పా 2026లో ఫస్ట్ ఫ్లైట్ ఎగురుతుంది అని.. వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు ఆరు లైన్ల రహదారి కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని అడిగాం.. మేం అడగటం వల్లే కేంద్రం శాంక్షన్ చేశామని స్వయంగా చెప్పారు… రెండేళ్ల నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు.. ఓవైపు ఎయిర్ పోర్టు పనులు పూర్తి అవుతుంటే రోడ్డు మీద మాత్రం ధ్యాస లేదని విమర్శించారు. కనీసం ఆ పని కూడా చేయలేదు.. కానీ చంద్రబాబు, ఆయన కేంద్రమంత్రి అంతా మేమే చేశాం అంటారు.. క్రెడిట్ విత్ ఔట్ కాంట్రిబ్యూషన్ అనేలా చంద్రబాబు మనస్తత్వం.. ఎవరో చేసిన దానికి క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటే అని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు
