ChandraBabu: పార్కును కూడా తాకట్టు పెట్టే స్థాయికి వచ్చారు: చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విమర్శలు చేశారు. జగన్ సీఎం అయ్యాక అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని.. అప్పు చేయకపోతే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యే స్థాయికి తీసుకువచ్చారని మండిపడ్డారు. 2009 నాటికి ఏపీ అప్పు 3,14,000 వేల కోట్లుగా ఉంటే.. ప్రస్తుతం ఏపీ అప్పు రూ.7లక్షల కోట్లకు చేరిందన్నారు. రాష్ట్రంలోని ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారని.. చివరకు విజయవాడలో పార్కును కూడా తాకట్టు పెట్టే స్థాయికి వచ్చారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన ఏపీ ప్రభుత్వ అధికారులు ఇంకొన్నిరోజులు ఆగితే రోడ్లను కూడా తాకట్టు పెడతారని విమర్శించారు.
ఈ ప్రభుత్వం పోకడల గురించి ఏం చెప్పాలో కూడా అర్ధం కావడం లేదని.. చెత్త మీద కూడా పన్నులు వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పోలవరంలో అవినీతి జరిగిందని గతంలో జగన్ ఆరోపణలు చేశారని… ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ ఆ ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరాన్ని 70 శాతం పూర్తి చేశామని, ఇప్పుడు ఆ పనులే ముందుకు సాగట్లేదని చంద్రబాబు తెలిపారు. పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు లేదన్నారు.
Also Read
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
తాజావార్తలు
-
Best AI Laptops 2026: AI ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్‌టాప్‌లు బెస్ట్ ఆప్షన్స్!
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!