Site icon NTV Telugu

ChandraBabu: పార్కును కూడా తాకట్టు పెట్టే స్థాయికి వచ్చారు: చంద్రబాబు

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి విమర్శలు చేశారు. జగన్ సీఎం అయ్యాక అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని.. అప్పు చేయకపోతే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యే స్థాయికి తీసుకువచ్చారని మండిపడ్డారు. 2009 నాటికి ఏపీ అప్పు 3,14,000 వేల కోట్లుగా ఉంటే.. ప్రస్తుతం ఏపీ అప్పు రూ.7లక్షల కోట్లకు చేరిందన్నారు. రాష్ట్రంలోని ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారని.. చివరకు విజయవాడలో పార్కును కూడా తాకట్టు పెట్టే స్థాయికి వచ్చారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన ఏపీ ప్రభుత్వ అధికారులు ఇంకొన్నిరోజులు ఆగితే రోడ్లను కూడా తాకట్టు పెడతారని విమర్శించారు.

ఈ ప్రభుత్వం పోకడల గురించి ఏం చెప్పాలో కూడా అర్ధం కావడం లేదని.. చెత్త మీద కూడా పన్నులు వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పోల‌వ‌రంలో అవినీతి జ‌రిగింద‌ని గతంలో జ‌గ‌న్ ఆరోప‌ణ‌లు చేశారని… ఇప్పుడు అధికారంలో ఉన్న జ‌గ‌న్ ఆ ఆరోప‌ణ‌ల‌ను రుజువు చేయాలని డిమాండ్ చేశారు. పోల‌వ‌రాన్ని 70 శాతం పూర్తి చేశామ‌ని, ఇప్పుడు ఆ ప‌నులే ముందుకు సాగ‌ట్లేదని చంద్రబాబు తెలిపారు. పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా స‌మాధానం చెప్పే ధైర్యం జ‌గ‌న్‌కు లేద‌న్నారు.

Exit mobile version