ఏపీ పర్యటనలో భాగంగా ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి భారతీ పవార్. మంగళగిరిలో ఏర్పాటుచేసిన ఎయిమ్సును సందర్శించిన కేంద్ర మంత్రి భారతీ పవార్.. అక్కడ అందుతోన్న సేవలపై రోగుల నుంచి ఆరా తీశారు. మందులు అందుతున్నాయా..? లేదా అంటూ రోగుల బంధువులను అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి పవార్.
జనరిక్ మెడిసిన్ అందుబాటులో ఉన్నాయా..? లేవా..? అంటూ ఆరా తీశారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలు గురించి కేంద్ర మంత్రి అడిగారు. అయితే, ఆయుష్మాన్ భారత్ పథకం గురించి అవగాహన లేదన్నారు రోగుల బంధువులు. ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించిన బోర్డులను ఆస్పత్రి ఆవరణలో డిస్ ప్లే చేయాలని మంత్రి పవార్ ఆదేశించారు.
దక్షిణాదిన మొదటి ఎయిమ్స్ మంగళగిరిలోనే ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడి సిబ్బంది రోగులకు చక్కటి సేవలు అందిస్తున్నారు. ఐపీడీ బ్లాక్సును కొన్ని నెలలు పూర్తి చేయనున్నాం. ఎయిమ్స్‌ను మరింత అభివృద్ది చేపట్టనున్నాం. ట్రామా సేవలను అందించేందుకు కృషి చేస్తాం. మంగళగిరి ఎయిమ్స్ కి ఎక్కువగా తెలుగు వారే వస్తారన్నారు కేంద్ర మంత్రి భారతీ పవార్. వారికి భాషాపరమైన ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. ఎయుమ్స్ ఆస్పత్రికున్న నీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తాం. ప్రస్తుతం యూజీ తరగతులు జరుగుతున్నాయి.. త్వరలోనే పీజీ క్లాసులు ప్రారంభించేలా చర్యలు చేపడతాం అన్నారు.
TRS : రాజ్ భవన్ ను రాజకీయాలకు కేంద్రంగా మారుస్తున్నారా..?