NTV Telugu Site icon

పెరుగుతోన్న కరోనా కేసులు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

గత కొంతకాలంగా మళ్లీ కరోనా పంజా విసురుతోంది.. అన్ని రాష్ట్రాలు క్రమంగా కేసులు పెరుగుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి.. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. కేసులను వర్చువల్ విధానంలో విచారించాలని నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.. కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత నుంచి అంటే ఈ నెల 17వ తేదీ నుంచి వర్చువల్ విధానంలోనే కేసుల విచారణ చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. కోర్టులో ఇక విచారణ ప్రత్యక్షంగా కాకుండా.. కేవలం ఆన్‌లైన్‌ విధానంలోనే కొనసాగనుంది.. కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ ఉధృతరూపం దాల్చిన సమయంలోనూ ఆన్‌లైన్‌లోనే కేసుల విచారణ కొనసాగించిన విషయం తెలిసిందే.

Read Also: సినిమా టికెట్‌ ధరలు తగ్గించి గొప్పలా..? సిమెంట్‌ ధరలు తగ్గించొచ్చుగా..!