NTV Telugu Site icon

Satya Kumar Yadav: క్యాన్సర్‌తో చాలా మంది చనిపోతున్నారు.. సరైన అవగాహన కల్పించాలి!

Satya

Satya

Satya Kumar Yadav: ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్‌ వ్యాప్తి పెను సవాల్ గా మారిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. ఇప్పటి వరకు 17.5 శాతం కాన్సర్ కారణంగా మరణిస్తున్నారని తెలిపారు. 9 శాతం మరణాలు క్యాన్సర్‌ వాళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ప్రజలకు సరైన అవగాహన లోపం, సరైనా టైంలో చికిత్స లేకపోవడంతో మరణాలు కొనసాగుతున్నాయి.. క్యాన్సర్‌ రోగానికి చికిత్స పోందితే నయం అవుతాయి.. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్‌ బాధితులను అదుకోవడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నామని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

Read Also: Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్‌ బాధితులను గుర్తించే ప్రక్రియ చేస్తున్నామని మంత్రి సత్య కుమార్ అన్నారు. సినీ నటులు కాన్సర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం‌.. ప్రజలు కూడా క్యాన్సర్‌ పరీక్షలను భయపడకుండా చేయించుకోవాలి.. అప్పుడు, ఈ క్యాన్సర్‌ అనే భూతాన్ని మన రాష్ట్రం నుంచి తరమి కొడతామని తెలిపారు. అలాగే, కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది అని చెప్పారు. ఈ బడ్జెట్ లో ప్రధాని మోడీ పేద, మధ్య తరగతి, రైతులకు న్యాయం జరిగేలా చూశారని మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు.