తుఫాన్ల కంటే వేగంగా విశాఖను విజయసాయి రెడ్డి ధ్వంసం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. విశాఖలో మీడియాతో మాట్లాడిన టీడీపీ ఉత్తరా౦ధ్ర ఇంఛార్జ్ బుద్దా వెంకన్న.. రాష్ట్ర ప్రజలంతా ‘జే’ టాక్స్ కడుతుంటే… విశాఖ ప్రజలు ‘వీజే’ టాక్స్ కడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. తుఫాన్ల కంటే వేగంగా విశాఖను విజయసాయి రెడ్డి ధ్వంసం చేస్తున్నారన్న ఆయన.. సీఎం జగన్ ఉత్తరాంధ్రలో ప్రజాదర్బార్ పెడితే ఆయనకి తెలిసినవి, తెలియకుండా విజయసాయి రెడ్డి చేసిన దందాలన్నీ బయటపడతాయన్నారు.. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే విజయసాయి రెడ్డి దోపిడీలపై విచారణ చేస్తామని ప్రకటించిన ఆయన.. బాధిత ప్రజల ఆస్తులను తిరిగి అ౦దజేసి న్యాయం చేస్తాం అన్నారు. ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో విజయసాయి రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు.. ప్రైవేట్ స౦స్థ ప్రతినిధులను సీఎం వైఎస్ జగన్ దగ్గరకి తీసుకువెళ్ల మీడియాటర్‌గా ఆయన వ్యవహరించారని ఆరోపించారు బుద్దా వెంకన్న. రానున్న ఎన్నికలలో ఉత్తరాంధ్రలో 34స్థానాలు టీవీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Russia-Ukraine War: రష్యా భీకర దాడులు.. పెద్ద సంఖ్యలో చిన్నారులు మృతి