NTV Telugu Site icon

Buddha Venkanna: అర్ధరాత్రి బుద్దా వెంకన్న నిరాహార దీక్ష భగ్నం

Buddha Venkanna

Buddha Venkanna

టీడీపీ సీనియర్‌ నేత బుద్దా వెంకన్న నిరాహార దీక్షను భగ్నం చేశారు పోలీసులు.. ఉత్తరాంధ్ర ప్రజా సమస్యలపై పోరాటం కోసమంటూ బుద్దా వెంకన్న బయలుదేరగా.. పోలీసులను ఆయన్ని అడ్డుకున్న విషయం తెలిసిందే.. దానికి నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు వెంకన్న.. ఉత్తరాంధ్రలో టీడీపీ నాయకులు పోరాడితే వైసీపీ నేతల దోపిడి బయటపడుతుంది అనే భయంతో.. ఇలా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.. అయితే, తన నివాసంలోనే నిరాహార దీక్షకు దిగిన బుద్దా వెంకన్నను అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించారు పోలీసులు.. బుద్దా వెంకన్నకు షుగర్ లెవల్స్‌ డౌన్ కావడంతో ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. అదనపు బలగాలను మొహరించి బుద్దా వెంకన్నను ఆయన నివాసం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ఇక, వెంకన్నను ఆస్పత్రికి తరలించే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. పోలీసు జీపుకు అడ్డుపడ్డారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. అయితే, వారిని పక్కకు లాగేసి… జీపులో బుద్దా వెంకన్నను ఆస్పత్రికి తీసుకెళ్లారు పోలీసులు.. ప్రభుత్వం, పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Saturday Special Govinda Namalu LIVE : గోవింద నామాలు.. తొలి కార్తిక శనివారం

Show comments