గుంటూరు నగరం కాకాణి రోడ్డు దారుణం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఓ దుండగుడు విద్యార్థినిని కత్తితో పొడిచి చంపాడు. ఓ ప్రైవేట్ కళాశాలలో ఆమె మూడ సంవత్సరం చదువుతోంది. అయితే… ఇవాళ ఉదయం ఒంటరిగా ఉన్న రమ్యను చూసి… కత్తితో దాడిచేసి హతమర్చాడు. అయితే.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనలో నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు పోలీసులు. ఇది ఇలా ఉండగా… రమ్య హత్య కేసులో బాధితురాలి సెల్ ఫోన్ కీలకంగా మారింది. రమ్య సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు… సెల్ ఫోన్ లాక్ ఓపెన్ చేసే పనిలో పడ్డారు. లాక్ ఓపెన్ చేస్తే హత్య కేసులో కీలక సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు పోలీసులు.