Boyfriend Tried To Kill His Lover For Chatting With Other Guy: తాను ఎఫైర్ పెట్టుకున్న మహిళ మరొకరితో చాటింగ్ చేస్తోందనే అనుమానంతో.. ఆమెపై హత్యయత్నాకి పాల్పడ్డాడు ఓ డ్రైవర్. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. డ్రైవర్‌గా పని చేస్తున్న బర్రె కిరణ్, విజయవాడ మారుతీనగర్‌లోని ఓ పెంట్ హౌస్‌లో అద్దెకు ఉంటున్నాడు. ఆ ఇంట్లో చేరినప్పటి నుంచే.. ఇంటి యజమానురాలితో అతడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా.. గత 15 ఏళ్ల నుంచి వీళ్లు తమ ఎఫైర్ నడుపుతున్నారు.
UK: నర్స్ అక్రమ సంబంధం.. కారులో అది చేస్తుండగా రోగి మృతి.. ఆమె పరిస్థితి
అయితే.. కొంతకాలం నుంచి ఇంటి యజమానురాలు తన ఫోన్‌లో ఎక్కువసేపు కాలక్షేపం చేస్తోంది. అర్థరాత్రి వరకు ఆన్‌లైట్‌లో ఉంటూ, ఎవరితోనో చాటింగ్ చేస్తోంది. అంతేకాదు.. గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుతుంది. ఇది గమనించిన కిరణ్.. మరో వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉంటోందనే అనుమానం పెంచుకున్నాడు. రానురాను అతడు ఆమెపై ద్వేషం పెంచుకొని, చంపాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం.. బ్యాంక్‌లో పని ఉందని చెప్పి ఆమెని కారులో ఎక్కించుకున్నాడు. విజయవాడ నుంచి బయలుదేరాడు. మార్గం మధ్యలో పెట్రోల్ బంక్ వద్ద ఆపి, ఒక క్యాన్‌లో నాలుగు లీటర్ల పెట్రలో కూడా కొన్నాడు. ముస్తాబాద్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి.. ‘‘ఈమధ్య ఎక్కువగా చాటింగ్ చేస్తున్నావ్? మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నావా?’’ అంటూ గొడవ పడ్డాడు. ఆమె కూడా వెనక్కు తగ్గకుండా, కిరణ్‌తో వాగ్వాదానికి దిగింది.
Arvind Swamy: 30 ఏళ్లకే స్టార్‌హీరో.. ప్రస్తుతం 3300 కోట్లకు యజమాని
ఈ నేపథ్యంలోనే కోపాద్రిక్తుడైన కిరణ్.. తొలుత కత్తితో ఆమెపై దాడి చేయబోయాడు. అప్రమత్తమైన ఆ మహిళ.. చేతిని అడ్డుకొని, అతనితో పెనుగులాడింది. కారు దిగి గట్టిగా కేకలు వేసింది. సమీపంలోనే నిర్మాణ పనుల్లో ఉన్న టిప్పిర్ డ్రైవర్లు ఆ కేకలు విని.. వెంటనే ఆమెను రక్షించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. కిరణ్ పారిపోవడానికి ప్రయత్నించగా.. వాళ్లు అతడ్ని పట్టుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి.. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకొని, కిరణ్‌ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.