Site icon NTV Telugu

Botsa Satyanarayana: రాష్ట్రంలో ఆటవిక పాలన.. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది..!

Botsa

Botsa

Botsa Satyanarayana: వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్‌కు అండగా న్యాయ సహాయం కోసం గుడివాడ మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ వెళ్లారు. అయితే, అక్కడ వారిపై కార్లపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేయడం దారుణమని ఎమ్మెల్సీ బొత్స నారాయణ అన్నారు. గుడివాడలో మాజీ మంత్రి పేర్నినాని వాహనాలపై దాడులు, దౌర్జన్యాలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. ఈ ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీకి మాజీమంత్రి ఫోన్‌ చేశారు. పోలీసుల తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలన, రెడ్‌ బుక్‌ రాజ్యాంగం కొనసాగుతుంది.. గుడివాడలో మాజీ మంత్రి పేర్నినాని లక్ష్యంగా రెండు సార్లు దాడులు చేశారు. కార్లపై దాడి చేసి అద్దాలు పగలగొట్టిన టీడీపీ, జనసేన నేతలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యం, దాడులు జరిగాయని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.

Read Also: Paris Paralympics: భారత పారాలింపిక్ పతక విజేతలతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని..

ఇక, ఈ దాడుల విషయం తెలుసుకుని టిడ్కో గృహాల దగ్గర మరో కారును ఉంచిన మాజీమంత్రి పేర్నినాని డ్రైవర్‌.. ఆ విషయం తెలుసుకుని.. అక్కడకు వెళ్లి మరీ కారుపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేశారని బొత్స నారాయణ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సన్నగిల్లుతున్నాయి.. వైసీపీ పార్టీ నాయకులకు ఏమైనా జరిగితే దానికి పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ఆయన అన్నారు. పోలీసులు తమ కర్త్యవాన్ని నిర్వహించి వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇలాంటి ఈ ఘటనలు నిదర్శనం అని బొత్స సత్యనారాయణ అన్నారు.

Exit mobile version