Site icon NTV Telugu

Botsa Satyanarayana: వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం

Botsa Satyanarayana

Botsa Satyanarayana

రాష్ట్రంలో మూడురాజధానులపై మరోసారి తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో వికేంద్రీకరణ అంశాలు పెట్టాం.. 29 గ్రామాలు, ఒక ప్రాంతం, ఒక వర్గం కోసం ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. 2019 నాటికి లక్ష 9 వేలు కోట్లు రాజధానికి గత ప్రభుత్వం ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. శివరామకృష్ణన్ కమిటీ కి గత ప్రభుత్వం కో ఆపరేట్ చేయలేదు. ఆ కమిటీ గత ప్రభుత్వం నిర్ణయం సరైనది కాదని చెప్పిందన్నారు.

Read Also: football match: గాల్లోనే ఆటగాళ్ల గోల్స్.. 20వేల అడుగుల ఎత్తులో ఫుట్ బాల్ మ్యాచ్

రాష్ట్ర సంపద ల్యాండ్ పూలింగ్ పేరుతో 29 గ్రామాల్లో పెట్టారు. ల్యాండ్ ఇచ్చిన వారికి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం చేస్తాము.. మనం కళ్ళు తెరిచే టైం కి రాష్ట్ర విభజన జరిగిపోయింది.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు,దొంగలు, దోపిడిదారులు పాద యాత్ర గా వస్తున్నారు.. రాష్ట్రంలో కుట్ర జరుగుతుంది..జరుగుతున్న దోపిడీని అడ్డుకోవాలి. చంద్రబాబు కి , లోకేష్ కి జై అని పాదయాత్ర మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రజలు కష్టాన్ని 29 గ్రామాల గోతులలో పోయాలి అంటున్నారు. తెలుగుదేశం ప్రజలు అభిమానం కోల్పోయిన పార్టీ, వారి ముసుగులో పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు మంత్రి బొత్స.

ఐదు కోట్ల ప్రజల పరిస్థితి ఏంటి? మన దేవుడి దగ్గరకి వచ్చి శాపాలు పెడతారా? ఇదెక్కడి చోద్యం. 29 గ్రామాలు రియల్ ఎస్టేట్ కోసం, ఒక పార్టీ మనుగడ కోసం యాత్ర చేస్తున్నారు. పాదయాత్ర కావాలంటే ఐదు నిమిషాలు చాలని కానీ అది సాంప్రదాయం కాదని చెప్తే నా మాటలు వక్రీకరించారు. ఇక్కడే రాజధాని కడతామని అగ్రిమెంట్ ఇవ్వలేదు. ఐదు కోట్ల ప్రజలు డబ్బులు ఆ మట్టి లో పోస్తే 29 గ్రామాల నుంచి మీరు సంపాదిస్తారా? రైతులు ముసుగులో టీ డీ పీ చేస్తున్న పాదయాత్ర కి బుద్ధి చెప్పాలన్నారు. పాదయాత్ర ఒక్క అడుగు ముందుకు వేయకుండా అడ్డుకోవాలి. దుష్ట శక్తులు, దుర్మార్గులు ను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మొహం పెట్టుకుని బీజేపీ నేతలు రాజధాని విశాఖ కి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. బీజేపీ నేతలు ద్వంద వైఖరి వహిస్తున్నారని దుయ్యబట్టారు మంత్రి బొత్స.

Read Also: Ayyanna Patrudu: ఏపీ సీఐడీ ఓవరాక్షన్ చేస్తోంది

Exit mobile version