football match: సాధారణంగా ఫుట్ బాల్ అంటే ఎక్కడ ఆడుతారు గ్రౌండ్లో. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రీడకు ఉన్న క్రేజ్ చెప్పనక్కర లేదు. భారీ మైదానాల్లో లక్షలాది మంది వీక్షకుల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ లు జరుగుతుంటాయి. ఇంకా ఫిఫా వరల్డ్ కప్ వచ్చిందంటే అభిమానులు టీవీలకు అతుక్కుపోతుంటారు. కానీ ఓ ఫుట్ బాల్ మ్యాచ్ మాత్రం అన్నింటికీ భిన్నంగా జరిగి ప్రపంచ రికార్డులను సృష్టించింది. అది భూమి మీద జరిగిన మ్యాచ్ కాదండోయ్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతంలో, అదీ గాల్లో తేలిపోతూ జీరో గ్రావిటీలో.. ఓ విమానంలో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్. ఇప్పుడు దీని గురించే ప్రపంచమంతా చర్చించుకుంటుంది.
జీరో గ్రావిటీ అంటే గాలిలో తేలుతామన్న విషయం తెలిసిందే. అయితే ఇదే జీరో గ్రావిటీలో ఓ ఫుట్బాల్ టీమ్మ్యాచ్ ఆడి గిన్నిస్రికార్డుకెక్కింది. ఎలా అంటే.. ఔట్ ఆఫ్ వరల్డ్ పేరిట ఓ మ్యాచ్నిర్వహించారు. అంటే దీని అర్థం ప్రపంచం బయట ఆడటం. ఇందులో భాగంగా ఏడుగురు ఆటగాళ్లను ప్రత్యేక విమానంలో సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తుకు పంపించారు. జీరో గ్రావిటీలోకి వెళ్లాకా విమానం లోపల ఏర్పాటు చేసిన 75 స్క్వేర్ మీటర్ల పిచ్‌పై మ్యాచ్ ఆడారు.
Read also: Tesla Cybertruck: ఈ కారు వాటర్‌లో బోట్‌లా పనిచేస్తుంది..
ఏడుగురు అంతర్జాతీయ ఫుట్ బాల్ ఆటగాళ్లు, మరొక వెటరన్ ప్లేయర్ కలిసి టీమ్ లుగా విడిపోయారు. రెడ్ టీమ్ ఓ వైపు, ఎల్లో టీమ్ ఓ వైపు. మధ్యలో రిఫరీలు, కెమెరామెన్లు. విమానం 20,230 అడుగుల ఎత్తులోకి వెళ్లాక పారాబోలిక్ ఫ్లైట్ మోడ్ లోకి వెళ్లింది. అంటే ఉన్నట్టుండి అతి వేగంతో విమానాన్ని పైకి తీసుకెళ్లి, మళ్లీ అంతే వేగంతో కిందికి తీసుకురావడం అన్నమాట. ఈ సమయంలో విమానంలో తాత్కాలికంగా జీరో గ్రావిటీ పరిస్థితి ఏర్పడుతుంది.
వీరిలో పోర్చుగీస్స్టార్ఫుట్బాలర్లూయిస్ ఫిగో పాటు మిడిల్‌ఈస్ట్, యూరోప్, లాటిన్ అమెరికాలకు చెందిన మహిళా, పురుషుల ఫుట్‌బాలర్స్ పాల్గొన్నారు. ఈ మ్యాచ్ లో ఫిగో కొట్టిన గోల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్లో రెడ్ టీమ్ 2-1 తేడాతో టీమ్ ఎల్లోపై విజయం సాధించింది.
Read also: 5G services: టెలికాం రంగంలో కొత్త శకం.. 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని
మొత్తంగా ప్రపంచంలోనే మొదటిసారి అత్యంత ఎక్కువ ఎత్తులో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ గా ఇది రికార్డులకు ఎక్కింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాస్టర్ కార్డ్ సంస్థ స్పాన్సర్ చేసిన ఈ ఫుట్ బాల్ మ్యాచ్ కు సంబంధించిన వీడియోను ఆ సంస్థ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. దానికి భారీగా వ్యూస్ వస్తున్నాయి.