Site icon NTV Telugu

Botsa Satyanarayana : పచ్చ మీడియా చెప్పేది జనం నమ్మరు

Botsa

Botsa

Minister Botsa Satyanarayana Fired on Yellow Media.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేడు వాడి వేడిగా సాగాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉగాది నుండి పార్టీని విస్త్రత స్థాయికి తీసుకుని వెళ్లాలని జగన్ చెప్పారని, వచ్చే నెల రెండు నుండి కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ మూడేళ్లు చేసిన అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు వివరిస్తామని, పదవుల్లో అందరికీ అవకాశం ఇచ్చేందుకు కొందరిని తొలగిస్తానని జగన్ ముందే చెప్పారన్నారు. పచ్చ మీడియా చెప్పేది జనం నమ్మరని, అదే నమ్మితే వైసీపి గెలిచేదా..? అని ఆయన వ్యాఖ్యానించారు.

జనం ఈలలు వేస్తే ప్రయోజనం ఉండదని, వారికి ఉపయోగపడే పనులు చేస్తే జనం గుండెల్లో పెట్టుకుంటారన్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే తప్ప పవన్ ఏ పనీ చేయలేడని, వైసీపీ పై ప్రజలకు అసంతృప్తి ఉంటే కదా వ్యతిరేక ఓటు ఉండటానికి అని ఆయన అన్నారు. పొత్తులు, మొక్కజొన్న పొత్తులు ఏం ఉంటాయని, ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎవరెవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలుస్తుందని ఆయన తెలిపారు.

https://ntvtelugu.com/duddilla-sridhar-babu-fired-on-trs-government/
Exit mobile version