NTV Telugu Site icon

Borugadda Anil Kumar: నేను జగన్‌ వీరాభిమానిని.. ఆయన కోసం చంపడానికైనా చావడానికైనా సిద్ధం..

Borugadda Anil Kumar

Borugadda Anil Kumar

Borugadda Anil Kumar: నెల్లూరు రాజకీయాలు ఇప్పుడు నెల్లూరులోనే కాదు.. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా చర్చగా మారాయి.. అయితే, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేస్తున్న విమర్శలు, కామెంట్లకు అదే స్థాయిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి కౌంటర్‌ ఎటాక్‌ జరుగుతోంది.. కోటంరెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బోరుగడ్డ అనిల్ కుమార్.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కోటంరెడ్డి లాంటి వాళ్లు జగన్మోహన్ రెడ్డి కాలి గోటి మట్టితో సమానం అని వ్యాఖ్యానించారు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోసం చంపడానికైన చావడానికైన సిద్ధమని ప్రకటించారు.. ఇక, చంద్రబాబు తన బినామీ సొమ్ముతో వైసీపీ ఎమ్మెల్యేలను కొనే ప్లాన్ వేస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు. ఎవరు నాయకుడో, ఎవరు మోసం చేసారో అనే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారన్నారు బోరుగడ్డ అనిల్‌ కుమార్.

Read Also: Vani Jayaram: వాణీ జయరాం మృతిపై అనుమానాలు.. రంగంలోకి ఫోరెన్సిక్‌.. అసలు ఏం జరిగింది..?

నేను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి వీరాభిమానిని.. నాకు వార్నింగ్ నుంచేతంట దమ్ము ఎమ్మెల్యే కోటంరెడ్డికి లేదన్నారు అనిల్‌ కుమార్‌. ముఖ్యమంత్రి జగన్ పై అవాకులు చవాకులు పేలితే , కోటంరెడ్డిని కుక్కను కొట్టినట్టు కొట్టి రోడ్డున ఇడ్డుకువస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ఇక, టికెట్లు దక్కవని తెలిసిన నాయకులే ఇలాంటి అసమ్మతి నాటకాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు బోరుగడ్డ అనిల్‌ కుమార్‌. కాగా, నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. ఈ దెబ్బతో ఆయన్ను పక్కనబెట్టిన వైసీపీ.. ఎంపీ అదాల ప్రభాకర్‌రెడ్డికి నెల్లూరు రూరల్‌ ఇంచార్జ్‌ బాధ్యతలు అప్పజెప్పింది.. ఇక, కోటంరెడ్డి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది.

Show comments