Bonda Uma: వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో.. వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు.. విజయవాడలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. దావోస్ పర్యటనకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 9సార్లు వెళ్లి ఏపీకి పెట్టుబడులు తెచ్చారు.. దావోస్ లో ఇప్పుడు సదస్సులు జరుగుతుంటే పక్క రాష్ట్రం, తెలంగాణ మంత్రి కేటీఆర్ వెళ్లారు.. పరిశ్రమలు తెలంగాణకు తీసుకెళ్తున్నారు.. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఒక్కసారి మాత్రమే దావోస్ వెళ్లారని.. ఇప్పుడు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. 4 ఏళ్లలో వైఎస్ జగన్ ఏపీకి తీసుకువచ్చింది పిచ్చి మందు, ఫిష్ మార్కెట్లు మాత్రమేనని ఎద్దేవా చేసిన ఆయన.. నాలుగేళ్లలో వైఎస్ జగన్ తెచ్చిన పరిశ్రమలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. వైఎస్ జగన్ అవినీతి దెబ్బకు పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలి అంటే వణికిపోతున్నాయని ఆరోపించారు. అసలు.. ఈ ఏడాది దావోస్ పర్యటనకు ఏపీ నుంచి ఎవరు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. దావోస్ పర్యటనకు వెళ్లకుండా ఏపీ ఐటీ మంత్రి కోడి పందెలు, పేకాట ఆడుతున్నారని ఫైర్ అయ్యారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు.
Read Also: TSPSE AEE Hall Tickets: ఏఈఈ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్.. పరీక్ష ఎప్పుడంటే?