TSPSE AEE Hall Tickets: ఏఈఈ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్.. పరీక్ష ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSE AEE Hall Tickets: తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి జనవరి 22న జరగనున్న రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను TSPSC విడుదల చేసింది. హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. AEE ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ TSPSC ID , పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 22న మొదటి సెషన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష సమయానికి కనీసం 45 నిమిషాల ముందు అభ్యర్థులు తమ నిర్దేశిత పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని TSPSC సూచించింది.
Read also: Raghunandan Rao: నిన్నటి వరకు దొంగల్లా కనిపించిన ఆంధ్రోళ్లు ఇవాళ ఆప్తులా?
Also Read
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
రాత పరీక్ష విధానం: రాత పరీక్ష మొత్తం 450 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్) 150 మార్కులు. పేపర్-2 (అభ్యర్థి సబ్జెక్ట్) 300 మార్కులు. పేపర్-1లో 150 మార్కులకు 150 ప్రశ్నలు, పేపర్-2లో 300 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల పరీక్ష సమయం కేటాయించారు.ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 3న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మిషన్ భగీరథ, నీటిపారుదల, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గిరిజన సంక్షేమం, ఆర్ అండ్ బీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో వీటిని భర్తీ చేస్తారు. AEE పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి, అక్టోబర్ 15 దరఖాస్తుకు చివరి తేదీ కాగా.. గడువును పొడిగించేందుకు అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు రావటంతో.. మరో 5 రోజులు అవకాశం కల్పిస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది.
Read also: Harish Rao: ఖమ్మం సభా వేదికపై వారు మాత్రమే ఉంటారు..
పోస్టుల వివరాలు..
* అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టులు మొత్తం ఖాళీల సంఖ్య: 1540
1) AEE(సివిల్)- PRRD విభాగం (మిషన్ భగీరథ): 302 పోస్టులు
2) AEE(సివిల్)- PRRD విభాగం: 211 పోస్టులు
3) AEE (సివిల్) MA UD-Ph: 147 పోస్ట్‌లు
4) AEE(సివిల్) TW విభాగం: 15 పోస్టులు
5) AEE ICAD విభాగం: 704 పోస్టులు
6) AEE (మెకానికల్) ICAD(GWD): 03 పోస్టులు
7) AEE (సివిల్) TRB: 145 పోస్టులు
8) AEE (ఎలక్ట్రికల్) TRB: 13 పోస్టులు
తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-09-2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-10-2022. (20.10.2022 వరకు పొడిగించబడింది)
* పరీక్ష తేదీ: 22.01.2023.
Sridevi First Husband: శ్రీదేవి మొదటి భర్త? అప్పట్లో సంచలనం
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి