Site icon NTV Telugu

AP BJP: ఏపీలో బీజేపీ అధ్యక్షుడి మార్పు.. సత్య కుమార్‌కు బాధ్యతలు అప్పగించే ఛాన్స్..?

Somuverraju

Somuverraju

AP BJP: కేంద్ర బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిని మార్చాలని నిర్ణయించింది. ఈ విషయమై జేపీ నడ్డా కొద్దిసేపటి క్రితం సోము వీర్రాజుకు ఫోన్ చేశారు. ‘మీ పదవీకాలం ముగిసింది.. మిమ్మల్ని మిస్ అవుతున్నాం.. మీరు రాజీనామా చేయండి’ అని నడ్డా తనకు సూచించినట్లు వీర్రాజు స్వయంగా తెలిపారు. సోముకు కొత్త బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన సీతా రామరాజు జయంతి కార్యక్రమంలో అల్లూరి మాట్లాడారు. 2020 జూలై 27 నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు కొనసాగుతున్నారు.మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సత్యకుమార్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చాలా రోజులుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిని మార్చడంపై చర్చ జరుగుతోంది.

Read also: Kadiyam Srihari: ’మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గల్లా ఎగరేసి చెప్పండి’ .. కడియం అని

సోము వీర్రాజు స్థానంలో కొత్త వ్యక్తిని ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుని.. సోము వీర్రాజును మార్చింది. మరోవైపు తెలంగాణలో కూడా నాయకత్వ మార్పు ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కూడా అధ్యక్ష పదవి నుంచి తప్పించనున్నారు. సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సంజయ్ భేటీ అయ్యారు. తెలంగాణలో అధ్యక్షుడి మార్పుపై సాయంత్రంలోగా అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల మార్పు ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున నాయకత్వ మార్పులపై చర్చ సాగుతోంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పార్టీని బలోపేతం చేసేందుకు అధ్యక్షుడిని మారుస్తున్నారు. మరి బీజేపీ మార్పులు చేర్పులు ఏ మేరకు లాభపడతాయో చూడాలి.
Minister Jogi Ramesh : రంగా ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు

Exit mobile version