Site icon NTV Telugu

Rajya Sabha: ఉత్తరాది నుంచి తెలుగు నేతలకు బీజేపీ అవకాశం

Bjpmps

Bjpmps

రాజ్యసభ ఆరేళ్ళ పదవీకాలం. రాజకీయనేతలకు అదో మంచి అవకాశం. అయితే ఈమధ్యకాలంలో రాజ్యసభ సీట్లు వ్యాపారవేత్తల్ని అందలం ఎక్కిస్తున్నాయి.రాజ్యసభకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెలుగు నేతలకు అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు అవుతుంటే.. మరికొన్ని చోట్ల ఎన్నికల అనివార్యం అయ్యేలా వుంది. జూన్ 10 న ఓటింగ్ జరగనుంది.

కొంతమంది నేతల్ని ఉత్తరాది నుంచి రాజ్యసభకు పంపాలని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఏపీ నుంచి పరిశీలనలో సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, పురందేశ్వరి పేర్లు వున్నట్టు తెలుస్తోంది. అలాగే తెలంగాణ నుంచి పరిశీలనలో డా. లక్ష్మణ్, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి పేర్లు వున్నాయి. రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని రాష్ట్రాలకు ఈదఫా అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయంచినట్లు సమాచారం.

రాజ్యసభలో తెలంగాణ నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గతంలో ప్రాతినిధ్యం లేని తమిళనాడు, కేరళ రాష్ట్రాల బీజేపీ నేతలకు రాజ్యసభలో అవకాశం ఇచ్చింది బీజేపీ అధిష్ఠానం. ఈనెలాఖరుతో ముగియనున్న రాజ్యసభ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసే ఆఖరు తేది దగ్గరపడుతోంది. టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయి బీజేపీలో చేరే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి అవకాశం ఇస్తామని అప్పట్లో సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ లకు బీజేపీ అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ లకు జూన్ 2 వతేదీ కల్లా పదవీకాలం పూర్తికానుంది. వీరిద్దరితో పాటు రాజ్యసభ పరిశీలనలో పురందేశ్వరి పేరు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దీంతో ఉత్తరప్రదేశ్ నుంచి తెలుగు రాష్ట్ర నేతలకు అవకాశం లభించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నుంచి ఒక్కొక్కరికి రాజ్యసభ లో అవకాశం రానుంది. సమీకరణలు కుదరని పక్షంలో ఒకరికి రాష్ట్రపతి కోటాలో నామినేటెడ్ పదవి లభిస్తుందని తెలుస్తోంది. తెలంగాణ నుంచి రాజ్యసభ పదవులకు పరిశీలనలో రాష్ట్ర బిజేపి మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ విజయశాంతి పేర్లు. మరో రెండు మూడు రోజులలో బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోనుంది.

Vangalapudi Anitha: మంత్రి మేరుగ నాగార్జున దళితుడు కాదా?

Exit mobile version