దేశ వ్యాప్తంగా కమ్యునిస్ట్ పార్టీలకు అడ్రస్ లేకుండా పోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. గురువారం ఆయన ఏపీ శ్రీకాకుళంలో జిల్లాలో పర్యటించారు. CPI, CPM లను ప్రజలు మర్చిపోయారన్నారు. కమ్యునిస్ట్‌లు బీజేపీపై ఏడుస్తూ లబ్దిపోందాలని చూస్తున్నారని, ఇండియా అలయన్స్ కూటమి పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఇండియాలో పార్టీలు ఓకరినోకరు తిట్టుకుంటూ విడి పోతున్నారని, కమ్యునిస్ట్‌ల వల్ల స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నష్టపోయారన్నారు. స్టీల్ ప్లాంట్ ద్రోహులు కాంగ్రేస్, కమ్యునిస్ట్‌లని, UPA 1 కమ్యునిలుగా ఉన్నారని.. మరేందుకు ఐరన్ ఓర్ మైన్స్ ఇప్పించలేకపోయారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ప్రధాన కులాలకు obc జాబితాలో చోటు లభించేలా… కృషి చేస్తున్నామని చెప్పారు.
NCBC కి తూర్పు కాపు, సోండి, కళింగ వైశ్య, శిష్ఠకరణాలను, అరవ కులాలను OBC చేర్చాలని కోరామన్నారు. దీనిపై NCBC సానుకూలంగా స్పందించి కేంద్రానికి సిఫార్సు లు చేసిందని తెలిపారు. కేంద్ర ఓబిసి జాబితాలో త్వరలో చేరుస్తామని, సామాజిక న్యాయం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర ప్రధాన సమస్యలను పరిష్కరిస్తున్నామని, కాశీకి రైలును విశాఖపట్నం నుండి ప్రారంభించామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుదల చేసామని, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని బలోపేతం దిశగా చర్యలు చెపడుతున్నామన్నారు. ఐరన్ ఓర్ గనుల కోసం NMDC కి సంప్రదిస్తున్నామని, రైల్వేజోన్ వీలైనంత త్వరగా ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విశాఖను గ్రోత్ హబ్‌గా కేంద్రం తీసుకుందని, దీంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని జీవీఎల్ వ్యాఖ్యానించారు.