NTV Telugu Site icon

వైసీపీ, టీడీపీపై జీవీఎల్‌ సంచలన వ్యాఖ్యలు..

GVL Narasimha Rao

GVL Narasimha Rao

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలపై అనుమానాలను వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ, వైసీపీ మధ్య లాలూచీ రాజకీయం నడుస్తోందని అనుమానంగా ఉందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం ప్రభుత్వంపై నిందలు వేస్తోందని మండిపడ్డ ఆయన.. మంత్రి పేర్ని నాని… బాబాలు పాలిస్తున్నారు అని విమర్శలు చేయడం దారుణం అన్నారు. కేంద్రపై నిందలు వేసేముందే ఒకసారి ఆలోచించుకోరా? అని ప్రశ్నించిన ఆయన.. హిందుత్వాన్ని అవమానిస్తూ మంత్రులు వ్యాఖ్యలు చేయడం శోచనీయం అన్నారు.. రాష్ట్రంలో పాస్టర్ల ప్రభుత్వమే రావాలా?. కేంద్రంపై విమర్శలు చేస్తేనే మంత్రి పదవిలో కొనసాగిస్తారని భావిస్తున్నారా…!? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర ఆర్థిక మంత్రి రాష్ట్రంలో పర్యటనలో ఉండగా మంత్రుల వ్యాఖ్యలు చేయటంపై వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటి? అని ప్రశ్నించారు జీవీఎల్… డిప్యూటీ సీఎం అమ్ జాద్ భాషా మళ్ళీ టిప్పుసుల్తాన్ భజన ఎందుకు చెస్తున్నారు? అని మండిపడ్డ ఆయన.. దీని వెనుక ఖచ్చితంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉన్నాయి ఆరోపించారు. వైసీపీ కుట్రలు చేస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వం హిందూ వ్యతిరేక ధోరణి స్పష్టంగా కనపడతుందన్న ఆయన.. టీడీపీ, వైసీపీ మధ్య లాలూచీ రాజకీయం నడుస్తోందని అనుమానంగా ఉందన్నారు. ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఆర్థిక వ్యవహారాలపై కేంద్రం జోక్యం చేసుకోదు… కానీ, పరిస్థితులు గాడి తప్పితే కచ్చితంగా కేంద్రం జోక్యం ఉంటుందని స్పష్టం చేశారు జీవీఎల్. ఏపీలో అసలైన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీయేనన్న ఆయన.. టీడీపీ పద్ధతులనే వైసీపీ అవలంభిస్తోందన్నారు.. టీడీపీలో దృశ్యం 2 నడిస్తే… వైసీపీ పాలనలో గరుడ పురాణం 2 నడుస్తోంది ఎద్దేవా చేసిన ఆయన.. గరుడ పురాణం 2 ఫ్లాప్ అవుతుందని సెటైర్లు వేశారు.