GVL Narasimha Rao: అధికారం పోగానే చంద్రబాబు హైదారాబాద్ వెళ్లిపోయారు.. 2024 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరిస్థితి గంతే.. లోటస్ పాండ్‌లో కూర్చుంటారు అంటూ జోస్యం చెప్పారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం అన్ని సహాయసహకారాలు అందిస్తున్నా రాష్ట్రంలో సుపరిపాలన లేదని విమర్శించారు.. వైసీపీ, టీడీపీ సొంత వ్యాపారాల కోసం పరిపాలనను ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. అయితే, బీజేపీ మాత్రమే ఏపీని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తుంది.. 2014 నుంచి ఇప్పటి వరకు రెట్టిపు కంటే జాతీయ రహదారులు వేశామని.. బెంగళూరు – విజయవాడ జాతీయ రహదారి పనులు వచ్చే ఏడాది మొదలు పెడతాం.. రాష్ట్రంలోని రోడ్ల నిర్మాణానికి కూడా కేంద్రం నిధులు ఇస్తుందని వెల్లడించారు.
Read Also: VV Lakshminarayana: ఎన్నికల్లో పోటీపై ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ..
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగ ఉత్పత్తి, ఎగుమతులు క్షీణించాయన్నారు జీవీఎల్ నరసింహారావు.. అసలు ఐటీ రంగనికి రాష్ట్రం చేసిందేంటి ? అని నిలదీశారు.. అధికారం పోగానే చంద్రబాబు హైదారాబాద్ వెళ్ళిపోయాడు.. ఇక, 2024 ఎన్నికల తర్వాత జగన్ లోటస్ పాండ్‌కు వెళ్లిపోతారని వ్యాఖ్యానించారు.. కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రంలో బయో టెక్నాలజీ పార్క్ ఇస్తామంటే రాష్ట్రం ముందుకు రావట్లేదని ఆరోపించారు.. కాపు రిజర్వేషన్ పై కేంద్రాన్ని ప్రశ్నించాం.. కానీ, రాష్ట్రంలో కాపులను బీసీల్లో చేర్చే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోదేనని స్పష్టం చేశారు.. కానీ, రాష్ట్ర ప్రభుత్యం బిల్లు చేసి పంపాము.. అని చెప్పి తప్పించుకుంటుందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
