Site icon NTV Telugu

GVL Narasimha Rao: ఆ తర్వాతే కేసీఆర్‌ ఏపీలో అడుగుపెట్టాలి..!

Gvl

Gvl

జాతీయ రాజకీయాలే లక్ష్యంగా టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేసిన తెలంగాణ సీఎం, గులాబా పార్టీ బాస్ కేసీఆర్.. ఏపీలోనూ పార్టీ విస్తరణకు చర్యలు చేపట్టారు.. అయితే, సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ మండిపడ్డారు.. ఆంధ్రులను తరిమికొడతానన్న కేసీఆర్‌ ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌ వస్తున్నారు? అని ప్రశ్నించారు జీవీఎల్.. బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్‌ ఏపీలో అడుగుపెట్టాలని డిమాండ్‌ చేశారు.. ఆంధ్రా పార్టీలు, నాయకత్వం వద్దన్న కేసీఆర్‌కు ఇక్కడ పనేంటి? అని నిలదీశారు. ఇక, తెలంగాణలోనూ బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడం ఖాయం అని జోస్యం చెప్పారు.. ఆంధ్రాకు కేసీఆర్‌ చేసిన ద్రోహం ప్రజలు మర్చిపోరన్న ఆయన.. అధికారంలోకి వస్తే పోలవరం కడతామనడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పోలవరంపై కేసీఆర్‌ కోర్టులో కేసులు వేశారని తెలిపారు.. శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తికోసం నీళ్లను సముద్రంపాలు చేశారు.. ఇలాంటి చర్యలతో ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుంది.. కానీ, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రాకు వస్తారని కేసీఆర్‌పై మండిపడ్డారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నర్సింహారావు.

Read Also: Supreme Court: ప్రజాప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Exit mobile version