మరోసారి పోలీసులపై ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే రీకాల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి ఏపీ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్.. పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యానికి నిరసనగా నిర్వహించిన దీక్షలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ పోలీసులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. పోలీసులు పార్టీ కండువాలు వేసుకున్నారని మండిపడ్డారు.. వ్యవస్ధ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో వుండిపోయింది.. ఇక్కడ పరిస్ధితులను చక్కదిద్దేందుకు కేంద్రం చూస్తోందని.. అందుకే రీకాల్ చేస్తారని చెప్పానని.. అది త్వరలోనే జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇక, ప్రధానికి పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం భద్రత కల్పించడంతో విఫలమైందని ఆరోపించిన సీఎం రమేష్.. ఈ వ్యవహారంపై రాహుల్, సోనియా స్పందించాలని డిమాండ్ చేశారు..
Read Also: సీఎం ఇంట్లో కరోనా కలకలం.. ఆయన సతీమణి సహా 15 మంది పాజిటివ్
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
కాగా, ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్‌లోని పోలీస్ వ్యవస్థపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు సీఎం రమేష్… రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం టెలిస్కోపుతో చూస్తుందన్న ఆయన.. అతి త్వరలోనే పోలీసు వ్యవస్థ ప్రక్షాళన ఉంటుందని పేర్కొన్నారు.. ఏపీలో పోలీసు ఉన్నతాధికారుల తీరు సరిగ్గా లేదని, వ్యవస్థలు ముఖ్యం అనే విషయాన్ని వారు ఎందుకు మర్చిపోతున్నారని ప్రశ్నించారు. అందుకే, అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్ అధికారులను రీ కాల్ చేస్తుందంటూ వ్యాఖ్యానించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!