సీఎం ఇంట్లో కరోనా కలకలం.. ఆయన సతీమణి సహా 15 మంది పాజిటివ్‌

కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు… సామాన్యుల నుంచి ప్రముఖులు, వీఐపీలు, వీవీఐపీలు.. ఇలా ఎవ్వరికీ మినహాయింపు లేదు అనే విధంగా పంజా విసురుతూనే ఉంది.. ఇప్పటికే భారత్‌లో థర్డ్‌ వేవ్‌ ప్రారంభం అయిపోయింది.. ఈ సారి సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది కోవిడ్‌ బారిన పడ్డారు.. తాజాగా, జార్ఖండ్ సీఎం హేమంత్​ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది.. సీఎం హేమంత్ సోరెన్​సతీమణి కల్పనా సోరెన్, ఆయన కుమారులు నితిన్, విశ్వజిత్ సహా మొత్తం 15 మంది కోవిడ్‌ బారినపడ్డారు.. వీరిలో సోరెన్ మరదలు సరళ మర్ముకూ కూడా ఉన్నారు.. అయితే, సీఎంకు నిర్వహించిన పరీక్షల్లో మాత్రం నెగెటివ్‌గా తేలింది.

Read Also: ప్రధాని కోసం మృత్యుంజయ హోమాలు.. బీజేపీ పిలుపు

అయితే, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ఇంట్లో కొంతమంది కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతుండడంతో టెస్ట్‌లు నిర్వహించారు… మొత్తం 62 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్టు రాంచీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్ తెలిపారు. అందులో సీఎం సతీమణి, ఇద్దరు పిల్లలు సహా ఏకంగా 15 మందికి పాజిటివ్‌గా తేలవడం కలకలం సృష్టించింది.. అయితే, వీరంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే ఉండి చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.. కాగా, జార్ఖండ్​లో కొత్తగా 5,081 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి.. మరో ముగ్గురు బాధితులు మృతిచెందారు.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,74,000కు చేరుకోగా.. ఇప్పటి వరకు 5,164 మంది మృతిచెందారు.. 347,866 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు..

Related Articles

Latest Articles