Site icon NTV Telugu

Vishnu Vardhan Reddy: రాయలసీమ ఎమ్మెల్యేలు, మంత్రులకు సిగ్గులేదా?

Vishnuvardhanreddy

Vishnuvardhanreddy

Vishnu Vardhan Reddy: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి “నేను ఉన్నాను.. నేను విన్నాను” అని నమ్మబలికి అధికారంలోకి వచ్చారని బీజేపీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి ఆరోపించారు. యువమోర్చా సంఘర్షణ యాత్రలో పాల్గొనడానికి చిత్తూరుకు వచ్చిన ఆయన రాష్ట్ర సర్కారుపై విమర్శనాస్త్రాలను సంధించారు. హంద్రినీవా, గాలేరు నగరి లాంటి రాయలసీమ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ ఎమ్మెల్యేలు, మంత్రులకు సిగ్గు లేదా ?.. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు నిలదీయటం లేదా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Umamaheswari Funerals: మహా ప్రస్థానంలో ఉమా మహేశ్వరి భౌతిక కాయానికి అంత్యక్రియలు పూర్తి..

ఈ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని అడగరా.. అంటూ ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం మైనింగ్, ల్యాండ్, స్యాండ్, లిక్కర్‌లపై ఆధారపడి అవినీతికి గేట్లు తెరిచిందని ఆయన ఆరోపించారు. మద్యం బ్రాండ్లపై, డిస్టల్లరీలపై చర్చకు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. ప్రజల ఆదాయ మార్గాలు పెరగలేదు కానీ , ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఇన్‌కం మాత్రం పెరిగిందని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై బీజేపీ పోరాడుతుందని విష్ణువర్ధన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Exit mobile version