ఏప్రిల్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారని ప్రచారం జరుగుతోంది.. ముఖ్యమంత్రి వచ్చి విశాఖలో కూర్చుని పరిపాలన ప్రారంభిస్తే ఎవరు అడ్డుకోలేరు.. బీజేపీ మాత్రం విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా అంగీకరించబోదని స్పష్టం చేశారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు.. ఋషికొండలో నిర్మాణాలు పూర్తయిన తర్వాత… ఇక్కడి నుంచే పరిపాలన ప్రారంభం కావొచ్చు అని అంచనా వేశారు. ఇక, రెండు వేల రూపాయల నోట్లు బ్యాంకుల్లో లేవు., మార్కెట్లలోను కనిపించడం లేదు… పెద్ద నోట్లను ఎవరు బ్లాక్ చేశారో తేల్చేందుకు ఆర్బీఐ విచారణ జరిపించాలని కోరారు.. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున జరుగుతోంది.. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.. కేంద్రం పన్నుల ఆదాయానికి గండి పడుతోంది.. దానిపై విచారణ చేయాలని కోరతామన్నారు..
Read Also: Election Campaigning Ban: ఆ గ్రామంలో అట్లుంటది మరి.. ప్రచారంపై నిషేధం.. ఓటు వేయకపోతే ఫైన్..
ఇక, సీఎం వైఎస్ జగన్ సభకు హాజరయ్యే ప్రజలకు డ్రెస్ కోడ్ ప్రకటిస్తూ ప్రభుత్వం ఒక జీవో జారీ చేయాలంటూ ఎద్దేవా చేశారు విష్ణుకుమార్ రాజు.. నరసాపురం సభకు వచ్చిన మహిళలతో చున్నీలు తీయించడం సిగ్గుచేటు అని మండిపడ్డ ఆయన.. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కళ్లకు ఈ చర్యలు తప్పు అనిపించ లేదా..? అని నిలదీశారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనవసరంగా విరుచుకుపడుతున్న వాసిరెడ్డి పద్మకు నరసాపురంలో జరిగిన దారుణం కనిపించ లేదా..? అని ప్రశ్నించారు. బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం.. ఇక్కడ మా నాయకులను జైలుపాలు చేస్తుంటే సహించేదిలేదని విరుచుకుపడ్డారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు.