Satya kumar: విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్) నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టింది.. ఈ మేరకు ఆయా సంస్థలతో ఎంవోయూలు కూడా కుదుర్చుకుంది.. అయితే, జీఐఎస్‌పై విపక్షాల నుంచి విమర్శలు తప్పడం లేదు.. ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. శ్రీ సత్యసాయి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మెలో ఒక్క పైసా కూడా విదేశీ పెట్టుబడి రాలేదని ఆరోపించారు.. బటన్‌లు నొక్కినట్లు ఉత్తుత్తి కార్యక్రమాలు చేయడమేంటి..! అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ టక్కుటమారా విద్యలు ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.. ఉపాధ్యాయ, పట్టబద్రుల ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో విద్యా అర్హతలు లేని వారిని, టీచర్ ట్రైనింగ్ కానీ వారిని దొంగ ఓట్ల జాబితాలో చేర్చారని విమర్శలు గుప్పించారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్..
Read Also: Sri chaitanya college: సాత్విక్ ఆత్మహత్య.. శ్రీచైతన్య కళాశాలకు శాశ్వత గుర్తింపు రద్దు
కాగా, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రెండు రోజుల్లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 378 ఒప్పందాలు జరిగాయి. 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుందని ప్రభుత్వం చెబుతోంది.. ఎంవోయూలు అమలు దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిన ఏపీ సర్కార్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. కమిటీ ప్రతి వారం సమావేశమై సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్.