NTV Telugu Site icon

Kanna Lakshminarayana: కాపులకు రాజకీయ దిశ నిర్దేశించే శక్తి నాలో లేదు.. జీవీఎల్‌ ఏం సాధించారని సన్మానాలు..?

Kanna Lakshminarayana

Kanna Lakshminarayana

Kanna Lakshminarayana: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మరోసారి సొంత పార్టీ నేతను టార్గెట్‌ చేశారు.. కాపు రిజర్వేషన్ల విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. అసలు ఏం సాధించారని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.. కాపులతో సన్మానాలు చేయించుకుంటున్నారు? అని నిలదీశారు.. గుంటూరులో మీడియాలో మాట్లాడిన కన్న.. ఏపీలో 22 శాతం ఉన్న కాపులు ఎటు ఉంటే అటు అధికారం రావటం 1989 నుంచి చూస్తున్నాం.. ఎన్నికల సమయంలోనే ఓట్లు అవసరం కాబట్టి కాపులను వాడుకుంటారు.. అత్యధిక శాతం ఉన్న కాపులను వాడుకునే ప్రయత్నం ప్రతిసారి జరుగుతుందని ఆరోపించారు.. కాపులకు రిజర్వేషన్ల డిమాండ్ సుదీర్ఘ కాలం నుంచి ఉంది.. చాలా మంది నాయకులు రిజర్వేషన్ ల కోసం పోరాటాలు చేశారని గుర్తుచేశారు. కాపులకు రిజర్వేషన్ లు ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నానని తెలిపారు.

Read Also: Special Story on Amazon’s Logistics Business: ట్రక్కులు, ఓడలు, విమానాల్లో డెలివరీ

ఇక, పవన్‌ కల్యాణ్‌ 9 ఏళ్ల క్రితం పార్టీ పెట్టారు.. జనసేన పార్టీ ని బయట నుంచి ఎవ్వరూ ప్రభావితం చేయకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు కన్నా లక్ష్మీనారాయణ.. జనసేన పార్టీని అధికారంలోకి తీసుకు రావటంపై పవన్ కల్యాణ్ నిర్ణయానికే వదిలేస్తే మంచిదన్నారు.. అసలు, జీవీఎల్ ఏం సాధించారని కాపులతో సన్మానాలు చేస్తున్నారో అర్థం కావటం లేదని మండిపడ్డారు.. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లకు చట్ట సవరణ చేసి రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది.. దాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో ఓబీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు ఇప్పిస్తే బాగుంటుందన్నారు.. 1994లో కాపుల స్కాలర్ షిప్ లకు సంబంధించి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి జీవో ఇచ్చారని గుర్తుచేశారు.. అయితే ఆయన బీసీ సంక్షేమ శాఖ తరపున జీవో ఇవ్వటంతో అమలు కాలేదన్న ఆయన.. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉండగా కాపు రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చిందని.. కాపుల సామాజిక ఆర్థిక సర్వే కోసం వైఎస్ చర్యలు చేపట్టారన్నారు. ఇక, చంద్రబాబు హయాంలో ఈబీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారని.. ఇలా కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు పూర్తి చేశారని తెలిపారు.. కాపుల సంక్షేమం కోసం పి.శివ శంకర్, మిరియాల వెంకట్రావు చిత్తశుద్ధితో పని చేశారని ప్రశంసలు కురిపించారు. అయితే, తనకు మాత్రం కాపులకు రాజకీయ దిశ నిర్దేశించే శక్తి లేదని స్పష్టం చేశారు కన్నా లక్ష్మీనారాయణ.