NTV Telugu Site icon

BJP: టిడ్కో ఇళ్లపై వైసీపీ సర్కార్‌కు బీజేపీ డెడ్‌లైన్‌..

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

టిడ్కో ఇళ్ల కేటాయింపులపై వైసీపీ ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. ఆగస్టు 15వ తేదీలోగా టిడ్కో ఇళ్లను కేటాయించాలని వైసీపీ ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ జీవీఎల్ గడువు పెట్టారు.. 30 లక్షల ఇళ్లు ఇస్తున్నామని చెబుతోన్న ప్రభుత్వం అక్కడ ఏం చేయలేదన్న ఆయన.. ఏపీలో టిడ్కో ఇళ్ల కోసం కేంద్రం రూ. 12 వేల కోట్లు కేటాయించిందన్నారు.. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఎలాట్ చేయకుంటే.. బీజేపీ ఉద్యమిస్తుందని ప్రకటించారు.. రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుంటే రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్రమే అలాట్‌మెంట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు.

Read Also: Amit Shah : హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్‌ షా

మరోవైపు, మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు జీవీఎల్.. మూడు రాజధానులనేవి ఉత్తుత్తి మాటేనని తేల్చేసిన ఆయన.. మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం చేయలేదన్నారు.. మూడు రాజధానులపై బిల్లు తెచ్చే అవకాశమే ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకే వెళ్లేదన్న ఆయన.. మూడు రాజధానులనేది ఉత్తుత్తి మాటే.. మళ్లీ మూడు రాజధానుల బిల్లు తెస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపుతో మాట్లాడుతోందని మండిపడ్డారు. ఇక, బీజేపీ అమరావతికే కట్టుబడి ఉందని స్పష్టం చేసిన బీజేపీ ఎంపీ.. కోర్టు తీర్పును ధిక్కరించేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో ప్రభుత్వం భ్రమలు కల్పించిందని.. గత మూడేళ్లుగా రాజధాని పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కించిందని ఆరోపించారు.