ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్నికలు జరిగే పరిస్థితి లేకపోయినా.. ముందస్తు ఎన్నికలపై ప్రచారం సాగుతోంది.. ప్రతిపక్ష టీడీపీ ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు అంటుంటే.. అధికార వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలకు పోయేదేలేదని స్పష్టం చేస్తోంది. ఇక, పొత్తులపై కూడా చర్చ సాగుతోంది.. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పవన్ కల్యాణ్ పొత్తులపై చర్చకు తెరలేపారు. అయితే, 2024 ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు..
Read Also: Andhra Pradesh: టెన్త్ ప్రశ్న పత్రం లీక్..! విద్యాశాఖ కీలక ఆదేశాలు
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. బీజేపీ పొత్తు ప్రజలతోనే.. ఉంటే జనసేన పార్టీతో ఉంటుందని స్పష్టం చేశారు. కుటుంబ పార్టీలతో పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టారు.. ఇక, జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు అని వ్యాఖ్యానించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు.. జనసేన వేరే పార్టీతో పొత్తు ఉంటుందనేది మీడియా సృష్టే అన్నారు. మొత్తంగా 2024 ఎన్నికల్లో బీజేపీ పొత్తులపై క్లారిటీ ఇచ్చేశారు సోము వీర్రాజు. కాగా, ఏపీలో బీజేపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఉండగా.. ఏ సమయంలోనైనా టీడీపీ కూడా ఆ రెండు పార్టీలతో స్నేహ్నం చేస్తుందనే చర్చ సాగుతోంది. పొత్తులు లేకుండా చంద్రబాబు ఎప్పుడైనా గెలిచారా? అని ప్రశ్నిస్తున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.